భారీ తేడాతో విండీస్ ను చిత్తు చేసిన భారత్.. వన్డే సిరీస్ భారత్ కైవసం..!

భారత్-వెస్టిండీస్( Ind vs WI ) మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో 200 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించి వన్డే సిరీస్ టైటిల్ కైవసం చేసుకుంది.

మొదటి వన్డే మ్యాచ్ గెలిచిన భారత్, రెండో వన్డే మ్యాచ్లో పేలవ ఆట ప్రదర్శించడంతో క్రికెట్ అభిమానులలో అసంతృప్తితో పాటు నిరాశ నెలకొంది.

మూడో వన్డే మ్యాచ్లో( Third ODI ) భారత్ ఎలాంటి ఆటను ప్రదర్శిస్తుందో.అనే అనుమానాలు క్రికెట్ అభిమానులను కాస్త ఉక్కిరిబిక్కిరి చేశాయి.

అయితే భారత జట్టు మూడో వన్డే మ్యాచ్లో మొదటి నుండి చివరి వరకు అద్భుత ఆటను ప్రదర్శించింది.భారత బ్యాటర్లు బ్యాటింగ్ తో చెలరేగితే.

బౌలర్లు బౌలింగ్ తో చెలరేగి వెస్టిండీస్ ను చిత్తు చేశారు.

Advertisement

మూడో వన్డేలో అదరగొట్టిన ఇషాన్ కిషన్ కు( Ishan Kishan ) ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు, శుబ్ మన్ గిల్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.టాస్ ఓడిన భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది.భారత బ్యాటర్లైన శుబ్ మన్ గిల్ 85, ఇషాన్ కిషన్ 77, హర్ధిక్ పాండ్య 70, సంజూ శాంసన్ 51, సూర్య కుమార్ యాదవ్ 35 పరుగులతో అద్భుత ఆటను ప్రదర్శించారు.భారీ లక్ష్య చేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు 35.3 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది.

ఆరంభంలోనే ముఖేష్ కుమార్( Mukesh Kumar ) భయపెట్టాడు.7 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు.దీంతో వెస్టిండీస్ జట్టు గట్టి ఎదురుదెబ్బే తగిలింది.

ఇక శార్దూల్ ఠాగూర్ 4 , కుల్దీప్ యాదవ్ 2, జయదేవ్ 1 వికెట్లు తీసుకున్నారు.భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ జట్టు బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం అర్థ సెంచరీ నమోదు చేయలేకపోయారు.

కాకపోతే చివర్లో వెస్టిండీస్ బ్యాటర్లైన మోతే 39 నాటౌట్, అల్జరీ జోసెఫ్ 26 లు తొమ్మిదో వికెట్ కు 55 పరుగులు జోడించారు.భారత్ వన్డే సిరీస్ టైటిల్ గెలవడంతో క్రికెట్ అభిమానులు సంతోషంతో సోషల్ మీడియా వేదికగా ప్రశంసగా కామెంట్లు పెడుతున్నారు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు