కాపులంతా వైసీపీ వెంటే ఉన్నామని నిరూపించుకోవాలి..: డిప్యూటీ సీఎం కొట్టు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో( Tadepalligudem ) కాపు ఆత్మీయ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ( Deputy CM Kottu Satyanarayana ) కీలక వ్యాఖ్యలు చేశారు.

తాను ఎమ్మెల్యే అవ్వకముందే తాడేపల్లిగూడెంలో రౌడీయిజం, గూండాయిజం ఉండేదన్నారు.అయితే తాను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత రౌడీయిజం, గూండాయిజాన్ని అంతం చేశామని పేర్కొన్నారు.

All Guards Should Prove That They Are With YCP Deputy CM Kottu ,YCP , Tadepallig

మళ్లీ అలాంటి వ్యక్తులతో చేతులు కలిపిన వ్యక్తిని జనసేన అభ్యర్థిగా నిలబెట్టారని విమర్శించారు.అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా వైసీపీ హయాంలో పని చేశానని తెలిపారు.

కాపుల ఆర్థిక పురోగతికి, భద్రతకు ఎప్పటికీ కృషి చేస్తానని స్పష్టం చేశారు.ముద్రగడ పద్మనాభం( Mudragada Padmanabham ) సూచనలతో కాపులంతా వైసీపీ వెంటే ఉన్నామని నిరూపించుకోవాలని సూచించారు.

Advertisement
మీ గోర్లు పొడుగ్గా దృఢంగా పెరగాలా.. అయితే ఈ చిట్కాలను మీరు ట్రై చేయాల్సిందే!

తాజా వార్తలు