ఆర్ఆర్ఆర్‌లో అందరికంటే ముందు నేనే అంటోన్న బ్యూటీ

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Alia Bhatt To Join First In RRR Shooting, Alia Bhatt, RRR, Rajamouli, NTR, Ram C

కాగా ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఫారిన్ బ్యూటీ ఒలివియా మారిస్‌లు నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

కాగా ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు మొదలుకానుండటంతో, ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కూడా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది.ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌ను నవంబర్ నుండి తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Advertisement

ఇందులో పాల్గొనేందుకు రెడీ అంటోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్.అయితే కరోనా నేపథ్యంలో తిరిగి ప్రారంభమయ్యే ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో తొలుత జాయిన్ అయ్యేది అమ్మడే అని చిత్ర వర్గాలు అంటున్నాయి.మొత్తానికి ఆలియా భట్ ఈ సినిమాలో నటిస్తుందా లేదా అనే సందేహం వ్యక్తం చేస్తున్నవారందరికీ ఇది షాకిచ్చే న్యూస్ అని చెప్పాలి.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యేందుకు ఆలియా భట్ ఆసక్తి చూపుతుండటంతో ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఆర్ఆర్ఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఆమె నిజంగానే షూటింగ్‌లో జాయిన్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు