ఆర్ఆర్ఆర్‌ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్‌ అవార్డ్‌ పై ఆలియా మొక్కుబడి స్పందనపై విమర్శలు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన అద్భుతం ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఏకంగా అంతర్జాతీయ స్థాయి అవార్డ్‌ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ అవార్డు వచ్చిన నేపథ్యంలో సినిమా కు సంబంధించిన ప్రతి ఒక్క యూనిట్ సభ్యుడు కూడా చాలా సంతోషంగా సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని అందరితో షేర్ చేసుకున్నారు.

కానీ అలియా భట్ మాత్రం కేవలం లవ్ ఇమేజ్ పెట్టి వదిలేసింది.ఆ మాత్రం స్పందన కూడా చేయక పోతే సోషల్ మీడియా లో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెకు తెలుసు, అందుకే లవ్ ఈమోజీని షేర్‌ చేసి తన యొక్క బాధ్యతని మొక్కుబడిగా నిర్వహించింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు.

ఈ సినిమా లో అలియా భట్ పాత్ర గురించి విమర్శలు వ్యక్తం అయ్యాయి.

ఆమె పాత్ర కు అసలు ప్రాముఖ్యత లేదు.అలాగే స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఎక్కువ సమయం లేదు.కనీసం 15 నిమిషాల పాటు కూడా ఆమె పాత్ర కనిపించక పోవడంతో అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

రాజమౌళి పై ఆ సమయం లో ఆలియా భట్ చాలా కోపంగా ఉన్నారని ప్రచారం కూడా జరిగింది.నిజానికి ఆలియా అభిమానులు సినిమా పై చాలా ఆశలే పెట్టుకున్నారు, సాధారణ ప్రేక్షకులు కూడా ఆలియా పాత్ర ను చూసి అంత పెద్ద స్టార్‌ హీరోయిన్ కి ఇలాంటి పాత్ర ఇవ్వడం రాజమౌళికి ఏమాత్రం సరి కాదంటూ విమర్శించారు.

హీరోల యొక్క ఎలివేషన్స్ సన్నివేశాలను తీయడంలో పెట్టిన శ్రద్ధను దర్శకుడు రాజమౌళి, ఆలియా పాత్ర పై పెట్టలేదు అనే విమర్శలు వచ్చాయి.ఆలియా కూడా ఒకింత ఆగ్రహంతోనే రాజమౌళి టీం పై ఉందని ప్రచారం జరిగింది.అందుకే ఇలా మొక్కుబడి ట్వీట్ వేసిందని.

గోల్డెన్ గ్లోబ్ అవార్డు

దక్కిన నేపథ్యంలో ఆలియా భట్ ఇంకా ఎక్కువ స్పందించాల్సిందని కొందరు అభిప్రాయం చేస్తున్నారు.దీనిపై చిత్ర యూనిట్ సభ్యులు మరియు ఆలియా భట్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్లు ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు