టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఈయన సినిమాల కోసం నందమూరి అభిమానులంతా ఎదురు చూస్తూనే ఉంటారు.
ఈ మధ్యనే ట్రిపుల్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి పాన్ ఇండియా హీరో అనిపించు కున్నాడు.ఇక ప్రెజెంట్ కొరటాల శివతో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.
ఇది ఇలా ఉండగా ఈయన ఈ మధ్య కాలంలో వేరే హీరోల సినిమాలకు ప్రొమోషన్స్ చేస్తూ వారికీ అండగా ఉంటున్నాడు.తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని ఈ సినిమాను ప్రోమోట్ చేసాడు.
ఈ సినిమా కొత్తగా ఉంటుంది అని.ప్రేక్షకులకు తప్పకుండ నచ్చుతుంది అని ఈ వేదికపై ఎన్టీఆర్ హామీ ఇచ్చాడు.ఎన్టీఆర్ ప్రొమోషన్స్ ఈ సినిమాకు వర్క్ ఔట్ అయినట్టే కనిపిస్తుంది.400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా ప్లాప్ అయితే పరిస్థితి ఏంటి అనే సందేహం అందరిలో కలుగుతుంది.ఈ సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అంతటా ఈ సినిమాను జనాలు ఎలా ఆదరిస్తారు అనే సందేహం ఉంది.
ఇదే సమయంలో సౌత్ లోని నాలుగు భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు రాజమౌళి ప్రొమోషన్స్ చేస్తున్నారు.దీంతో రాజమౌళి ఎన్టీఆర్ ను రంగంలోకి దించడంతో మన తెలుగులో కాస్త బజ్ తెచ్చుకుంది.అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యింది.
బుకింగ్స్ బాగా జరుగుతున్న నేపథ్యంలో ఈ క్రెడిట్ అంతా ఎన్టీఆర్ కే దక్కుతుంది అనడంలో సందేహం లేదు.అలాగే రిలీజ్ తర్వాత మంచి టాక్ వస్తే ఈ సినిమా వసూళ్లు బాగానే రాబట్టే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రలలో నటించారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy