Nagarjuna Mahesh Bhat: అబ్బో..ఆలియా భట్ తండ్రికి నాగార్జున అంటే ఇంత ప్రేమా ?

ఆలియా భట్( Alia Bhat ) తండ్రి మహేష్ భట్( Mahesh Bhat ) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

కానీ నేడు ఆయన అవికా గోర్( Avika Gor ) నటించిన 1920 సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.

ఇదే సినిమా ఫంక్షన్ కి టాలీవుడ్ మన్మధుడు నాగార్జున( Nagarjuna ) కూడా రావడం విశేషం.అవికా గోర్ నటించే అన్ని సినిమాలకు దాదాపుగా నాగార్జున హాజరవుతూనే వస్తున్నారు.

వీరిద్దరికి ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా బంధం మొదలైంది.అవిక తనకు ఎంతో స్పెషల్ అంటూ చెపుతారు నాగార్జున.

ఇక అవికా గోర్ కి నాగార్జున అంటే చాలా ఇష్టం.ఈ సంగతి కాసేపు పక్కన పెడితే, ఈ ఫంక్షన్ కి వచ్చిన మహేష్ భట్, నాగార్జున ప్రవర్తన ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Advertisement

మహేష్ బట్ హిందీలో పేరు మోసిన ఒక దర్శకుడు అనే విషయం మనందరికీ తెలిసిందే.

ఈయన ఎంతో మంది హీరోలను తన సినిమాల ద్వారా పరిచయం చేశాడు.బాలీవుడ్ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా కొన్ని ఏళ్ల పాటు ఏకచత్రాధిపత్యం చేశాడు.అయితే మహేష భట్ దర్శకత్వంలో నాగార్జున సైతం మూడు (దాదాపు) చిత్రాల్లో నటించారు.

అవి zakhm, క్రిమినల్, అంగారే వంటి చిత్రాలు.ఈ సినిమాల ద్వారా నాగార్జునకు బాలీవుడ్ లో అభిమానులు ఏర్పడటానికి మహేష్ భట్ ఒక కారణమయ్యాడు అందుకే వీరికి ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం ఉంటుంది.

అయితే నేడు అవికా గోర్ సినిమా ఫంక్షన్ లో కలిసిన వీరిద్దరూ ఒకరితో ఒకరు ఎంతో చనువుగా కనిపించారు అది ఎంతలా అంటే నాగార్జున యొక్క జుట్టు సరి చేసి నుదుటిపై ముద్దుల వర్షం కురిపించాడు మహేష్ భట్.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

అలా చాలాసేపు నాగార్జున తలను పట్టుకొని మహేష్ భట్ వదలలేదు.మాటిమాటికి నాగార్జున జుట్టు సవరిస్తూ ఆయన ముద్దులు పెడుతూ ఉండటాన్ని చూసిన చుట్టూ పక్కల వారంతా కూడా కాసేపు షాక్ లోనే ఉండిపోయారు.కానీ అవేమీ పట్టకుండా నాగార్జున మరియు మహేష్ భట్ వారి ముచ్చట్లలో మునిగిపోయారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

Advertisement

ఎంత అభిమానం ఉంటే ఎన్నిసార్లు ముద్దులు పెట్టాలా అంటూ కొంత మంది మహేష్ భట్ ప్రవర్తన పై పెదవి వేరు విరుస్తున్నారు.ఇక నాగార్జున మాత్రం మహేష్ భట్ కనిపించగానే మొదటగా కాళ్లకు దండం పెట్టి ఆయనకు మహేష్ బట్ పై ఉన్న అభిమానాన్ని తెలియజేసే ప్రయత్నం చేశాడు.

తాజా వార్తలు