బాబోయ్‌ మరీ ఇంత ఏడుపా: ఇంటి సభ్యులే కాకుండా నాగ్‌, ప్రేక్షకులు కూడా ఎమోషన్‌ అయిన వేళ

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 నుండి ఏడవ వారం ఎలిమినేట్‌ అవ్వబోతున్నది అలీ రెజా అంటూ మేము ముందే చెప్పేసిన విషయం తెల్సిందే.

మా వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం అలీ రెజా ఎలిమినేట్‌ అయ్యాడని రాయడం జరిగింది.

నిన్నటి ఎపిసోడ్‌లో అదే నిజం అయ్యింది.కాని అలీ ఎలిమినేట్‌ అయిన సమయంలో ఇంట్లో నెలకొన్న పరిస్థితులను చూసి అంతా కూడా అవాక్కయ్యారు.

ఇంటి సభ్యులు ప్రతి ఒక్కరు కూడా కన్నీరు పెట్టుకున్నారు.అలీతో గతంలో గొడవ పెట్టుకున్న వారు, అలీపై కోపగించుకున్న వారు అంతా కూడా కన్నీరు పెట్టుకున్నారు.

  మీ కన్నీరు చూస్తే నాకు కూడా కళ్లలో నీళ్లు తిరిగాయంటూ నాగార్జున చెప్పడం విశేషం.ఇక బయట ప్రేక్షకుల పరిస్థితి కూడా అలాగే ఉంది.ఇంటో ముఖ్యంగా శివ జ్యోతి మరియు శ్రీముఖిల ఏడుపు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఏడుపు వచ్చింది.

Advertisement

ఇక రవి మరియు రాహుల్‌ ఇంకా వరుణ్‌ లు కూడా ఏడుస్తూనే అలీకి వీడ్కోలు పలికారు.ఆరు వారాల పాటు అదృష్టం మరియు మంచితనంతో కనీసం ఎలిమినేషనకు నామినేట్‌ కాకుండా వచ్చిన అలీ రెజా ఏడవ వారంలో ఎలిమినేషన్‌కు నామినేట్‌ అవ్వగానే ఎలిమినేట్‌ అవ్వడంను ఎవరు జీర్ణించుకోలేక పోయారు.

  నిన్నటి ఎలిమినేషన్‌లో ఎక్కువగా మహేష్‌ లేదా రాహుల్‌ అనుకున్నారు.రాహుల్‌ శనివారమే సేవ్‌ అయ్యాడు.ఇక మిగిలి ఉన్నది మహేష్‌ కనుక ఆయనే ఎలిమినేట్‌ అవుతాడని సామాన్య ప్రేక్షకులు భావించారు.

లీక్‌ కాకుంటే మేము అదే అనుకునే వాళ్లం.కాని అనూహ్యంగా కారణం ఏదో కాని అలీ ఎలిమినేషన్‌ అయ్యాడు.

అలీ ఎలిమినేషన్‌ అవ్వడంకు పెద్దగా కారణాలు కూడా ఏమీ లేవు.ఆయన ఎందుకు ఎలిమినేట్‌ అయ్యాడో అర్థం కాని పరిస్థితి.

ఊరి కోసం ప్రాణ త్యాగం చేసిన ముసలమ్మ కథ ఏమిటో మీకు తెలుసా..?

అలీ వెళ్లి పోయిన సమయంలో శివ జ్యోతి ఏడుపు ప్రతి ఒక్కరిని కదిలించింది.ఆ తర్వాత అలీ స్టేజ్‌ పై ఫోన్‌ మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు.

Advertisement

అలీ 50 రోజులు ఉండి మొదటి సగం విజేత తానే అనుకుంటూ వెళ్లాడు.నిజంగానే అంత మంది ప్రమాభిమానాలను దక్కించుకున్న అలీ విజేత అంటూ నాగ్‌ అన్నారు.

ఇక ముందు ముందు మరెన్ని షాక్‌లను బిగ్‌బాస్‌ ప్రేక్షకులకు మరియు ఇంటి సభ్యులకు ఇవ్వబోతున్నాడో చూడాలి.

తాజా వార్తలు