Srisailam : శ్రీశైలం వెళ్లాలనుకునే భక్తులకు అలర్ట్... ఈ సేవలో మార్పులు..

పవిత్రమైన కార్తీక మాసంలో చాలామంది భక్తులు మన దేశంలోని ప్రధానమైన పుణ్యక్షేత్రాలకు వెళ్లి పూజలు చేస్తూ ఉంటారు.

అందుకోసమే మన దేశంలోని చాలా ఆలయాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.

దేవదేవుడైన నీలకంఠుడి దర్శనంతో పాటు, శక్తిపీఠమైన భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు చాలా దూర ప్రాంతాల నుండి భారీ ఎత్తున వస్తున్నారు.దీనివల్ల దేవస్థానం భక్తులతో రద్దీగా ఉంది.

ఈ పరిస్థితుల మధ్య శ్రీశైలం దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.కార్తీక మాసంలో భక్తులు రద్దీగా ఉండడం వల్ల శ్రీశైలం దేవస్థానం అధికారులు ఆలయ అర్జిత సేవలో మార్పులు చేశారు.

రేపటి నుంచి ఈనెల 23వ తేదీ వరకు గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలిపివేస్తున్నట్లు దేవస్థానం అధికారులు చెబుతున్నారు.శుక్రవారం నుండి రాత్రి 9 గంటలకు భక్తులకు సర్వదర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

Advertisement
Alert For Devotees Who Want To Go To Srisailam. Changes In This Service , Srisai

స్వామి అమ్మవార్లకు కళ్యాణం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్ర హోమం, చండీ హోమం లాంటి కార్యక్రమాలలో మొదటి ఏ సమయంలో చేసేవారో అదే సమయంలో చేస్తున్నారు.శని,ఆది, సోమవారాల్లో స్వామివారి అలంకార దర్శనం మాత్రమే ఆలయ అధికారులు భక్తులకు కల్పించనున్నారు.

Alert For Devotees Who Want To Go To Srisailam. Changes In This Service , Srisai

అయితే కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.మల్లన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీ ఎత్తున శ్రీశైలం దేవస్థానానికి వస్తున్నారు.దేవస్థాన ఆధ్వర్యంలో జరిగిన లక్ష దీపోత్సవం లో ఆధ్యాత్మిక శోభ ఉంది.

పుష్కరిణి వద్ద ప్రత్యేక వేదికపై భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవ మూర్తులను ఏర్పాటు చేసిన అర్చకులు, వేద పండితులు ప్రత్యేకమైన పూజలు చేసి, ఆ తర్వాత దేవతలందరికీ హారతులు ఇచ్చారు.భక్తుల రద్దీ ఎక్కువ ఉండడంతో శ్రీశైల దేవస్థానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

పిల్లలకు ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు ఇవ్వండి.. ఏ రోగం కూడా దరిచేరదు..?
Advertisement

తాజా వార్తలు