అలాస్కా ఎయిర్‌లైన్స్ ప్రమాదం: యూఎస్ ఎఫ్ఏఏ కీలక నిర్ణయం.. అన్ని బోయింగ్ 737-9 మాక్స్ విమానాల నిలిపివేత

ఇటీవల అలస్కాలో( Alaska ) జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

అన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను( Boeing 737 Max planes ) తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది.

టేకాఫ్ అయిన తర్వాత బోయింగ్ విమానం లోపల జరుగుతున్న ప్రమాదాల కారణంగా ఎఫ్ఏఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.తదుపరి నోటీసు వచ్చే వరకు బోయింగ్ 737 విమాన కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించారు.

మంగళవారం బోయింగ్ సీఈవో డేవ్ కాల్హౌన్ .( Boeing CEO Dave Calhoun ) అలస్కా ఎయిర్‌లైన్స్ ప్రమాదంపై స్పందించారు.ఈ ఘటనకు పూర్తి బాధ్యత తమదేనని .మా తప్పును అంగీకరిస్తున్నామని డేవ్ తెలిపారు.

కాగా.మంగళవారం బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాన్ని తిరిగి ఆపరేట్ చేయడానికి చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది.విమాన తనిఖీలు చేపట్టే విమానయాన సంస్థలకు మార్గదర్శకాలను సవరించాలని ప్రభుత్వం బోయింగ్‌ను ఆదేశించింది.

Advertisement

ఎఫ్ఏఏ అడ్మినిస్ట్రేటర్ మైక్ విటేకర్( FAA Administrator Mike Whitaker ) మాట్లాడుతూ.కొన్ని బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు గాల్లోకి లేచేముందు తనిఖీలు తప్పనిసరి అన్నారు.

అలస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1282కి సంబంధించి ఎన్‌టీఎస్‌బీ పరిశోధనలో ప్రభుత్వపరమైన సాయం వుంటుందని మైక్ స్పష్టం చేశారు.

ఇకపోతే .ఈ నెల 5న 171 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న అలస్కా ఎయిర్‌లైన్స్‌కు( Alaska Airlines ) చెందిన బోయింగ్ 737 9 మ్యాక్స్ విమానం డోర్ గాల్లోనే ఊడి ఎగిరిపోయింది.ఈ ఘటనతో ప్రయాణీకులంతా ప్రాణభయంతో వణికిపోయారు.

ఈ ఫ్లైట్ పోర్ట్‌ల్యాండ్ నుంచి అంటారియోకు బయల్దేరింది.అయితే టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఎమర్జెన్సీ డోర్ ఊడి ఎగిరిపోయింది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

గాలి ఒత్తిడి కారణంగా ఆ డోర్ పక్కనే వున్న సీటు కూడా గాల్లోకి ఎగిరిపోయింది.ఆ వెంటనే ఆక్సిజన్ మాస్కులు వేలాడుతూ బయటకు వచ్చాయి.

Advertisement

పైలట్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని తిరిగి పోర్ట్ ల్యాండ్‌కు తరలించాడు.అయితే ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కానీ బోయింగ్ 737 9 మ్యాక్స్ విమానాల భద్రతపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

తాజా వార్తలు