స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం అల వైకుంఠపురములో అన్ని పనులు ముగించుకుని సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో బన్నీ మరోసారి బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టడం ఖాయమని ఆయన ఫ్యాన్స్‌తో పాటు చిత్ర యూనిట్ ధీమాగా ఉన్నారు.
అయితే సంక్రాంతి బరిలో బన్నీతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం కూడా ఉండటంతో ఈ సినిమా ఎలా తట్టుకోగలదో అనే సందేహం అందరిలోనూ ఉంది.కానీ ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ చూస్తే ఈ సినిమాకు ఏ స్థాయిలో క్రేజ్ ఏర్పడిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
త్రివిక్రమ్, బన్నీల కాంబో కావడంతో ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బయ్యర్లు ఈ సినిమా హక్కులను అదిరిపోయే రేటుకు సొంతం చేసుకున్నారు.ఈ సినిమా ప్రపంచ్యవాప్తంగా రూ.84.46 కోట్ల మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.ఈ రేంజ్‌లో ప్రీరిలీజ్ బిజినెస్ జరగడం బన్నీ కెరీర్‌లోనే మొదటిసారి అని ఈ సినిమా లెక్కలు చూస్తే చెప్పొచ్చు.
పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు.ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్త ప్రీరిలీజ్ బిజినెస్ విరవాలు ఈ విధంగా ఉన్నాయి నైజాం - 20.00 కోట్లు సీడెడ్ - 12.06 కోట్లు నెల్లూరు - 2.80 కోట్లు కృష్ణా - 5.00 కోట్లు గుంటూరు - 6.30 కోట్లు వైజాగ్ - 8.50 కోట్లు ఈస్ట్ - 6.30 కోట్లు వెస్ట్ - 5.00 కోట్లు టోటల్ ఏపీ+తెలంగాణ - 65.96 కోట్లు కర్ణాటక - 7.20 కోట్లు రెస్టాఫ్ ఇండియా - 1.50 కోట్లు ఓవర్సీస్ - 9.80 కోట్లు టోటల్ వరల్డ్‌వైడ్ - 84.46 కోట్లు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy