బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లక్ష్మీ బాంబ్’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది.
ఈ సినిమాను తొలుత వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.కానీ లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాను రిలీజ్ చేయలేకపోయారు చిత్ర యూనిట్.దీంతో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేద్దామని చిత్ర యూనిట్ భావిస్తోంది.
అయితే ఓటీటీలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాగా ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన కాంచన చిత్రానికి రీమేక్‌గా వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాను రాఘవ లారెన్స్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.కాగా అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
అయితే ఈ సినిమాను ఓటీటీలో ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యాడు.స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమాలో అక్షయ్ పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.కాగా ఈ సినిమాతో రాఘవ లారెన్స్ బాలీవుడ్‌లోనూ తన పాగా వేయాలని చూస్తున్నాడు.కాంచన సినిమా దక్షిణాదిన ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.
మరి ఈ సినిమా బాలీవుడ్ జనాలను ఎంతవరకు మెప్పిస్తుందో తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy