యూట్యూబర్ కి ఏకంగా 500 కోట్ల ఫైన్ వేసిన అక్షయ్ కుమార్.. ఎందుకంటే..?

బాలీవుడ్ సూపర్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ కు భయంకరమైన కోపం వచ్చింది.

దీనికి కారణం చాలా సెలబ్రిటీస్ పై యూట్యూబ్ లో రూమర్స్ వస్తూ ఉండటం మనం గమనిస్తూనే ఉంటాం.

కాకపోతే ఓ చనిపోయిన సినీ నటుడు కి తనకి సంబంధం ఉందంటూ వరుసగా వచ్చిన అసత్య ప్రచారం చూసి అక్షయ్ కుమార్ ఒక్కసారి ఫైర్ అయ్యాడు. అక్షయ్ కుమార్ తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ అన్ని చూస్తూ ఓపిక పట్టి ఒక్కసారిగా దానికి కారణమైన ఓ యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న వ్యక్తి పై ఏకంగా 500 కోట్ల పరువు నష్టం దావా వేసి ఆశ్చర్యపరిచాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.తాజాగా విడుదలైన అక్షయ్ కుమార్ లక్ష్మి సినిమా పై నెగిటివిటీ భారీగా పెరగడం గల కారణం సుశాంత్ కి అక్షయ్ కుమార్ అన్యాయం చేశాడని వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువగా రావడమే.

అందులో హీరో సుశాంత్ కు రావలసిన సినిమా ఆఫర్లు అక్షయ్ కుమార్ తీసుకువెళ్ళాడు అంటూ కామెంట్స్ వచ్చాయి.వాటిని మరింత బలంగా చేకూర్చేందుకు కొన్ని చానల్స్ అక్షయ్ కుమార్ పై వీడియో లు చేస్తూ మరింత నెగిటివిటీ అనిపించారు.

Advertisement
Akshay Kumar Field Case On Youtuber, Akshay Kumar, Susanth Singh, YouTube's, So

ఇందుకు సంబంధించి బీహార్ రాష్ట్రానికి చెందిన రషీద్ సిద్ధికి అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్ లో ఏకంగా అక్షయ్ కుమార్ సుశాంత్ కేసులో ఓ కీలక వ్యక్తి అని సంబోధిస్తూ హీరోయిన్ రియా చక్రవర్తి సుశాంత్ మరణం తర్వాత కెనడాకు వెళ్ళిపోవడానికి అక్షయ్ కుమార్ ఎంతో సాయం చేశాడంటూ అతడికి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ నెగిటివ్ కామెంట్ చేశారు.వీటితోపాటు ఎంఎస్ ధోని సినిమాలో దక్కించుకోవడానికి సుశాంత్ నుండి దక్కించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడని ఇష్టమొచ్చినట్లు మాటలు మాట్లాడాడు.

Akshay Kumar Field Case On Youtuber, Akshay Kumar, Susanth Singh, Youtubes, So

వీటితో పాటు హీరో సుశాంత్ తో చనిపోయిన తర్వాత ముంబై పోలీసులతో అతడు రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారని అనేక కథనాలు చెప్పి, వాటి ద్వారా యూట్యూబ్ నుండి పెద్ద మొత్తంలో సంపాదించాడు కూడా.ఇదంతా ఇలా ఉండగా అక్షయ్ కుమార్ తాజాగా ఈ నెగిటివ్ కామెంట్స్ సంబంధించి ఎలాగైనా పుల్ స్టాప్ పెట్టాలని అక్షయ్ కుమార్ యూట్యూబ్ చెందిన వ్యక్తి పై ఏకంగా 500 కోట్ల పరువు నష్టం వేయడంతో ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఒకింత షాక్ గురైంది.చూడాలి మరి ముందు ముందు ఈ కేస్ ఏ సైడ్ వెళ్తుందో.

Advertisement

తాజా వార్తలు