హీరో రామ్ ని దున్నపోతు తో పోల్చిన అక్కినేని నాగార్జున..!

అఖండవంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బోయపాటి శ్రీను చేసిన చిత్రం స్కంద.

( Skanda ) హీరో రామ్ ని మునుపెన్నడూ చూడని రేంజ్ మాస్ లుక్ లో చూపించి, అందరినీ షాక్ కి గురి చేసాడు బోయా.

ఈ చిత్రం లోని పాటలు మరియు ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.మాస్ సెంటర్స్ లో కచ్చితంగా రామ్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయని ట్రైలర్ ని చూసే చెప్పేయొచ్చు.

వచ్చే నెల 20 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ఇప్పటి నుండే ప్రారంభం అయ్యింది.హీరో రామ్ మరియు హీరోయిన్ శ్రీలీల కలిసి ఇచ్చిన మొదటి ఇంటర్వ్యూ యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అవుతుంది.

ఇక నేడు రామ్( Ram Pothineni ) మా టీవీ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో కి కూడా తన సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు వచ్చాడు.

Advertisement

ముందుగా రామ్ ఎంట్రీ ఇవ్వగానే నాగార్జున( Nagarjuna ) నువ్వు మంచి డ్యాన్సర్ వి, శ్రీలీల( Sreeleela ) కూడా అద్భుతమైన డ్యాన్సర్, మీ ఇద్దరు కలిసి ఈ సినిమాలో డ్యాన్స్ మాత్రమే చేసారా, ఇంకేమైనా చేసారా అని అడుగుతాడు, అప్పుడు రామ్ కేవలం డ్యాన్స్ మాత్రమే చేసాం సార్ అని సమాధానం ఇస్తాడు.ఇంకా నాగార్జున రామ్ తో మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక షాట్ ఉంది కదా, దున్నపోతు ని పట్టుకొని వస్తూ ఉంటావు అని అంటాడు.అప్పుడు రామ్ దానికి సమాధానం ఇస్తూ అందరూ దానిని దున్నపోతు అని అనుకుంటున్నారు, కానీ అది ఆసియా ఖండం లోనే అతి పెద్ద దున్నపోతు,( Ploughing ) దాని బరువు రెండున్నర తన్నులు ఉంటుంది అని అంటాడు.

అప్పుడు నాగార్జున దానికి సమాధానం ఇస్తూ నువ్వేమి తక్కువ లేవు, దానంత బరువే ఉన్నావు అని అంటాడు.

ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ ఉండగా, శివాజీ రామ్ తో మాట్లాడుతూ హౌస్ లోకి వచ్చే ముందు మీ స్కంద టీజర్ చూసాను, మీ కెరీర్ లోనే బెస్ట్ సినిమా అవుతుందని అనిపించింది.అంత బాగానే ఉంది కానీ, దీని తర్వాత వెంటనే పెళ్లి చేసేసుకోండి అని అంటాడు.అప్పుడు రామ్ అది ఇష్టం తో చెప్తున్నారో , బాధతో చెప్తున్నారో అర్థం కావట్లేదు అని అంటాడు.

అప్పుడు శివాజీ, అది ఇష్టం తోనే చెప్తున్నాను,పెళ్లి చేసుకొని చేయాల్సినవి చాలా ఉంది కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది అని అంటాడు.అలా మొత్తం ఫన్ తో ఈరోజు ఎపిసోడ్ ఉండబోతుంది.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు