యాక్షన్ ఫినిష్ చేసి రొమాన్స్ కు రెడీ అవుతున్న 'ఏజెంట్'!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ మధ్యనే బ్యాచిలర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అఖిల్ అదే జోష్ లో ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఇక ఇప్పటి వరకు ఏజెంట్ సినిమాలో భారీ యాక్షన్ చేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించిన సురేందర్ రెడ్డి ఇప్పుడు రొమాన్స్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం.

ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను పోర్ట్ ఏరియాల్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే.స్పై త్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారని టాక్.

Advertisement
Akhil Is Getting Ready For Romance After Completing The Action Scenes In The Mov

ఈ ఇద్దరు హాట్ హీరోయిన్స్ తో మరొకసారి రొమాన్స్ పండించడానికి అఖిల్ సిద్ధం అవుతున్నాడు.

Akhil Is Getting Ready For Romance After Completing The Action Scenes In The Mov

ఇప్పటికే ఒక కథనాయికగా సాక్షి వైద్య ఎంపిక అవ్వగా.మరో హీరోయిన్ గా తమిళ నటి అతుల్య రవి ని ఫిక్స్ చేసారని సమాచారం.ఇందులో మెయిన్ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా తెలియలేదు.

ఇక ఇప్పుడు హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

Akhil Is Getting Ready For Romance After Completing The Action Scenes In The Mov

ఈ భారీ యాక్షన్ సినిమాను ఏకే ఎంటర్టైన్ మెంట్స్, సురేందర్ రెడ్డి 2 సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఇటీవలే యూరప్ లోని బుడాపెస్ట్ లో షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న చిత్ర యూనిట్ త్వరలోనే మరొక షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమాకు కూడా టాలీవుడ్ మ్యూజిక్ సెన్సషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!

మరి ఈ సినిమాతో కూడా హిట్ అందుకుని అఖిల్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజా వార్తలు