'ఏజెంట్' రిలీజ్ డేట్ ప్రకటన అప్పుడేనట.. కొత్త ఏడాదిలో సరికొత్తగా!

యంగ్ హీరో అక్కినేని అఖిల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి సూపర్ హిట్ అందుకున్నాడు.

ఈ సినిమా హిట్ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా ప్రకటించడమే కాకుండా సినిమా షూట్ కూడా పూర్తి చేస్తున్నాడు.

అయితే శరవేగంగా పూర్తి అవుతున్న సమయంలో కరోనా ఈ సినిమాకు అడ్డంకిగా మారింది.ఇక అప్పటి నుండి షూట్ స్లో అయిపొయింది.

ఏజెంట్ సినిమాను ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసాడో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం రిలీజ్ కు నోచుకోవడం లేదు.ఈ సినిమా విషయంలో ముందు అనుకున్న రిలీజ్ డేట్స్ అన్ని కూడా తారుమారు అయ్యాయి.

అందుకే ఈ సినిమా ఆగష్టులో రిలీజ్ చేస్తామని చెప్పినా కూడా రిలీజ్ చేయలేక పోయారు.ఇక అక్టోబర్.

Advertisement
Akhil Akkineni Agent Release Date Update Details, Agent Release Date, Akhil Akki

డిసెంబర్.సంక్రాంతి అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు.

ఏది ఏమైనా సంక్రాంతి సీజన్ లో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది అని అనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్.అయితే సంక్రాంతికి బాలకృష్ణ, చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోలు వస్తున్నారు.

Akhil Akkineni Agent Release Date Update Details, Agent Release Date, Akhil Akki

దీంతో ఏజెంట్ సినిమా మెల్లగా సైడ్ అయిపోయింది.ఈ క్రమంలోనే కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.మరి ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను జనవరి 1న కొత్త ఏడాదిలో సరికొత్త పోస్టర్ తో గ్రాండ్ గా ప్రకటిస్తారని టాక్ వస్తుంది.

ఇప్పటికే ఫిబ్రవరి నెలలో రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసారని.ఆ రోజు ప్రకటిస్తారని తెలుస్తుంది.చూడాలి ఎప్పుడు ప్రకటిస్తారో.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తుండగా మలయాళ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు