పావలా శ్యామలకు అండగా నిలిచిన పూరి కుమారుడు ఆకాష్...మంచి మనస్సు అంటూ?

సినీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన వారిలో నటి పావలా శ్యామల( Pavala Shyamala ) ఒకరు.

ఈమె స్టార్ హీరోలైనా చిరంజీవి ప్రభాస్ వెంకటేష్ మహేష్ బాబు వంటి హీరోల సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అయితే ప్రస్తుతం ఈమెకు వయసు పై పడటంతో సినిమాలలో నటించలేని స్థితిలో ఉన్నారు.అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న కుమార్తె కూడా ఉండటంతో ఈమె పరిస్థితి చాలా దయనీయ స్థిలో ఉంది.

  అయితే గతంలో ఈమెకు మెగాస్టార్ చిరంజీవి మా అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు కాదంబరీ కిరణ్ వంటి వారు ఆర్థికంగా సహాయం అందించారు.

Akash Jagannath Helps To Actress Pavala Shyamala Details, Pavala Shyamala, Akash

ఇకపోతే ఇటీవల పావలా శ్యామల తన పరిస్థితి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.తాను 50 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతోమంది హీరోల సినిమాలలో నటించాను.అయితే ఇప్పుడు నా పరిస్థితి చాలా దయనీయస్థితిలో ఉంది.

Advertisement
Akash Jagannath Helps To Actress Pavala Shyamala Details, Pavala Shyamala, Akash

ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి చెందినవారు నాకు సహాయం చేసి నా ప్రాణాలను కాపాడాలని లేకపోతే తనకు ఆత్మహత్య శరణ్యం అంటూ ఈమె ఎమోషనల్ అవుతూ తన పరిస్థితిని తెలియజేశారు.

Akash Jagannath Helps To Actress Pavala Shyamala Details, Pavala Shyamala, Akash

ఇలా శ్యామల దయనీయ పరిస్థితిని గుర్తించిన డైరెక్టర్ పూరీ జగన్నాథ్( Puri Jagannath ) కుమారుడు ఆకాశ్ జగన్నాథ్( Akash Jagannath ) పావలా శ్యామల ఉంటున్న ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సోసైటీకి వెళ్లి ఆమెను కలిసి తన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం పావలా శ్యామల చేతిలో లక్ష రూపాయల డబ్బును పెట్టి ధైర్యంగా ఉండాలని తనకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు అంటూ ఆమెకు భరోసా ఇచ్చారు.ఇలా పూరి జగన్నాథ్ శ్యామల పరిస్థితి తెలిసిన వెంటనే ఆమెను కలిసి తనకు ఆర్థిక సహాయం చేయడంతో ఈయన మంచి మనసు పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు అదేవిధంగా మరికొంతమంది ఆమెకు అండగా నిలవాలని కూడా కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు