Hero Ajith: గొప్ప మనసు చాటుకున్న హీరో అజిత్.. తోటి రైడర్ కోసం అలాంటి పని?

తమిళ స్టార్ హీరో తల అజిత్ కుమార్( Hero Ajith ) గురించి మనందరికీ తెలిసిందే.

తమిళ సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ రజినీకాంత్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతుండగా ఆ తర్వాత స్థానంలో అజిత్, దళపతి విజయ్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

హీరో అజిత్ కి తమిళంలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈరోజు అజిత్ నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే థియేటర్ లు జాతరను తలపిస్తూ ఉంటాయి.

యంగ్ హీరో దళపతి విజయ్ కి పోటీగా నిలుస్తూ వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.

ఇక అజిత్ నటించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ మాస్టర్ హిట్టుగా నిలవడంతో పాటు కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నాయి.ఇకపోతే సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన లైఫ్ ను ఎంతో సింపుల్గా జీవించేందుకు ఇష్టపడుతూ ఉంటారు అజిత్.కాగా హీరో అజిత్ కు రైడింగ్ అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలోనే ఇటీవలే దేశంలోని ప్రధాన నగరాలను చుట్టొచ్చారు అజిత్.ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్​తో పాటు యూరప్​ లోని కొన్ని సిటీల్లోనూ బైక్​పై విహార యాత్ర చేశారు.

అయితే నేపాల్​లో అజిత్ బైక్​ టూర్​లో ఉండగా తోటి రైడర్ సుగత్ సత్పతి( Sugat Satpathy ) ఆయనకు సాయంగా నిలిచారు.దీంతో అతడికి అజిత్ విలువైన గిఫ్ట్ ఇచ్చారు.

సుగత్ కోసం ఏకంగా రూ.12.5 లక్షల విలువైన బీఎండబ్ల్యూ సూపర్ బైక్​ను( BMW Bike ) కొనుగోలు చేశారు అజిత్.టూర్​లో తనకు సాయం చేసినందుకు సుగత్​ కు బైక్​ను బహుమతిగా ఇచ్చారు అజిత్.

ఈ విషయాన్ని ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు సుగత్. ఇంత పెద్ద సూపర్​ స్టార్​తో టచ్​లో ఉండటం తన అదృష్టమని తెలిపారు.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

కాగా అజిత్ చేసిన పనికి అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.స్టార్ హీరోలు అయినప్పటికీ ఇంత సింప్లిసిటీ గా ఉండడం కేవలం అతి తక్కువ మంది హీరోలకు మాత్రమే సాధ్యం.

Advertisement

అటువంటి వారిలో అజిత్ కూడా ఒకరు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

తాజా వార్తలు