నడిరోడ్డుపై అజయ్ దేవగన్ కు ఘోర అవమానం...ఏం జరిగిందంటే?

కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీల్లో రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్న విషయం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.

ఇంకాస్త దూకుడు పెంచి ఎర్రకోట ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఆ ముట్టడిలో కొన్ని అసాంఘిక శక్తులు ప్రవేశించడం వలన ఆ ముట్టడి కాస్త రైతుల లక్ష్యం నేర్చకపోగా మొత్తం నీరుగారిపోయింది.అయితే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తున్నా సెలెబ్రెటీలు ఏమాత్రం స్పందించకపోవడం పెద్ద దుమారాన్నే రేపింది.

అయితే దీనిపై సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు స్పందించిన తీరు పెద్ద వివాదాస్పదమైంది.అయితే రైతుల ఉద్యమం మీద బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా స్పందించిన విషయం తెలిసిందే.

అజయ్ దేవగన్ ఏమన్నారంటే భారత దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని, దయచేసి అటువంటి వారి వలలో రైతులు పడవద్దని కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడడంతో రైతులు అజయ్ దేవగన్ మీద అగ్రహం వ్యక్తం చేశారు.అయితే తాజాగా అజయ్ దేవగన్ కు నడిరోడ్డు మీద ఘోర అవమానం జరిగింది.

Advertisement
Ajay Devgan Insulted On Road What Happened ,ajay Devagan, Farmer Strike,bollywoo

అజయ్ దేవగన్ రోడ్డు మీద ప్రయాణిస్తుండగా ఓ రైతు ఆపి ఇక చట్టాల వల్ల రైతులు ఎంతలా నష్టపోతున్నారో మీకు తెలియదని చాలా ఆగ్రహంతో ఆ వ్యక్తి ఊగిపోయారు.కారులోనుండే అతనికి నమస్కరిస్తూ తప్పుకోమని చెప్పినా ఆ వ్యక్తి వినలేదు.

ఇక అక్కడ పెద్ద ఎత్తున జనం గుమిగూడడంతో పోలీసులు జోక్యం చేసుకొని అక్కడ నుండి అజయ్ దేవగన్ ను పంపించి, అతనిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి అతనిపై కేసు నమోదు చేశారు.ఇప్పుడు నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.

రైతులకు మద్దతు పలికే వారు ఆ వ్యక్తిని సమర్థిస్తుండగా, అలా చేయడం సరికాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Ajay Devgan Insulted On Road What Happened ,ajay Devagan, Farmer Strike,bollywoo
ఒక్క స్పూన్ గసగసాలతో జుట్టుకు ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
Advertisement

తాజా వార్తలు