వర్చువల్‌ మీటింగ్‌లో వుండగా బాడీ మసాజ్... దుమ్మెత్తిపోస్తున్న నెటిజనం!

సాధారణంగా బాడీ మసాజ్( Body Massage ) అనేది చాలామంది ఏకాంతంగా ఓ నాలుగు గోడలు మధ్య చేసుకుంటారు.

అయితే ఆరుబయట కూడా ఇలాంటి స్పాలు లేకపోలేదు, అది వేరే విషయం.

దాదాపుగా ఇండ్లలో చేసుకొనేవారు నాలుగు గోడలు మధ్య చేసుకుంటూ వుంటారు.ఇక ప్రముఖులైతే చెప్పాల్సిన పనిలేదు.

వారు ఈ విషయంలో ఇంకా సీక్రసీ మెంటైన్ చేస్తూ వుంటారు.ఈ తరుణంలోనే తాజాగా ఎయిర్‌ ఏషియా సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

షర్ట్‌ లేకుండా వర్చువల్‌ మీటింగ్‌కు హాజరవ్వడంపై ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.

Advertisement

విషయంలోకి వెళితే, మలేసియాకు చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్స్‌ సంస్థ ఎయిర్‌ ఏషియా( Air Asia ) గురించి మీరు వినే వుంటారు.దీని సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌( Tony Fernandes ) తాజాగా లింక్డిన్‌లో ఓ పోస్ట్‌ చేశారు.మసాజ్‌ చేసుకుంటూ మేనేజమెంట్‌ మీటింగ్‌కు హాజరయ్యాను అంటూ ఆయనే స్వయంగా ఫొటోను కూడా జత చేశాడు.

అక్కడితో ఆగకుండా ఎయిర్‌ ఏషియాలో పని సంస్కృతికి నిదర్శనం అని పేర్కొన్నారు.ఈ మీటింగ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలిపారు.కాగా ఈ పోస్ట్‌ పెట్టిన కాసేపటికే వైరల్‌గా మారింది.

కట్ చేస్తే దీనిపైన నెటిజన్లు తిట్ల పురాణం అందుకున్నారు.మసాజ్‌ చేసుకుంటూ మీటింగ్‌కు హాజరవ్వడమే కాకుండా మా వర్క్‌ కల్చర్‌ ఇదీ అంటూ పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఆయన పోస్ట్‌పై వారు తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.కొందరు “ఒక లిస్టెడ్‌ కంపెనీకి సీఈఓగా( CEO ) ఉంటూ.

మేనేజ్‌మెంట్‌ మీటింగ్‌కు ఇలా నగ్నంగా హాజరవ్వడం పట్ల మీకు సిగ్గు అనిపించడంలేదా?” అంటూ కామెంట్ చేశారు.మరికొందరు స్పందిస్తూ.

ఫ్రీ టైమ్‌లో నన్ను చూసి నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతా : నాని
గుడ్లు ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోండి!!

“మీ వర్క్‌ కల్చర్‌ చూపించడానికి ఇది సరైన పద్ధతి కాదు!” అని కామెంట్స్ చేశారు.ఇంకొందరైతే “ఓపెన్‌ కల్చర్‌ అంటే మరీ ఇంత ఓపెన్‌ అనుకోలేదు!” అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు