బుకింగ్స్‌ అయితే ప్రారంభం, కాని నమ్మకం తక్కువే

కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ గడువు ఈనెల 14తో ముగియనున్న విషయం తెల్సిందే.

దాంతో పలు విమానయాన సంస్థు దేశీయ విమానాలకు బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశాయి.

ఈ నెల 15వ తారీకు నుండి విమానాల రాకపోకలు ఉంటాయి అన్నట్లుగా బుకింగ్స్‌ను ప్రారంభించింది.అయితే ప్రభుత్వ అధికారిక సంస్థ ఎయిర్‌ ఇండియా మాత్రం ఏప్రిల్‌ 30 తర్వాత బుకింగ్స్‌ను ప్రారంభించింది.

Air India And Railway Bookings Open In After April 30Th, Corona Virus, India Loc

ఇక రైల్వే బుకింగ్స్‌ కూడా ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బుకింగ్స్‌ ప్రారంభించాము.

ఒకవేళ లాక్‌ డౌన్‌ను కొనసాగించినట్లయితే బుక్‌ చేసుకున్న టికెట్లను రద్దు చేసుకునే వెసులుబాటును కల్పించామంటూ చెప్పుకొచ్చారు.పూర్తి అమౌంట్‌ను టికెట్‌ కు తిరిగి ఇవ్వబోతున్నట్లుగా రైల్వే శాఖ ప్రకటించింది.

Advertisement

విమానయాన ఇంకా రైల్వే శాఖతో పాటు పలు రాష్ట్రాల ఆర్టీసీలు ఇంకా ప్రైవేట్‌ ఏజెన్సీలు కూడా బుకింగ్స్‌ను ప్రారంభించినట్లుగా సమాచారం.అయితే దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్న కారణంగా మరో వారం లేదా రెండు వారాల పాటు లాక్‌ డౌన్‌ను కొనసాగించడం మంచిదనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

లాక్‌ డౌన్‌ను దశలవారీగా ఎత్తి వేసే ప్రతిపాధనలు కూడా ఉన్నాయి.కనుక ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు