స్విగ్గి చేసిన ప్రకటనపై మండిపడుతున్న దుకాణదారులు

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ షాపింగ్ వైపు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.

ఈ క్రమంలో బట్టలు, ఇంట్లో వస్తువులు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే ఆర్డర్ చేసేందుకు యాక్సిస్ ఉండేది.

కానీ, ప్రస్తుతం ఫుడ్ ఐటమ్స్ కూడా ఆన్లైన్ ద్వారానే ఆర్డర్ చేసుకొని మరి ఇంటికి డెలివరీ చేస్తూ ఉన్నారు.ఈ లిస్టులోకి తాజాగా కిరాణా సామాన్లు( Consumer Goods ) కూడా కేవలం నిమిషాల్లోనే డెలివరీ చేస్తామని పలు రకాల కంపెనీలు యాడ్స్ ను ప్రకటిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇంటికే అన్నీ డెలివరీ చేసి ఇస్తుండడంతో పలు ఆఫర్స్ తో కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి కంపెనీలు.ఈ క్రమంలో రిటైల్ షాపులకు( Retail Shops ) వెళ్లి సామాన్లు కొనుక్కునే పరిస్థితి చాలా తగ్గిపోయింది.

ఇంటి వద్దకే డెలివరీ చేయడంతో పాటు ఆఫర్లు డిస్కౌంట్ లో ఇస్తుండడంతో అందరూ వీటిపైనే ఇష్టం చూపుతో ఉన్నారు.అయితే, తాజాగా స్విగ్గి ఇన్‌స్టామార్ట్( Swiggy Instamart ) చేసిన ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.ఈ క్రమంలో స్విగ్గి ఇన్‌స్టామార్ట్ చేసిన ప్రకటనలో ఏముందన్న విషయానికే వస్తే.

Advertisement

రిటైల్ షాపుల నుంచి కొనుగోలు చేయడం ఆపండి.మీము కేవలం 10 నిమిషాల్లోనే సరుకులను డెలివరీ చేస్తామని ప్రకటనలో తెలియచేసారు.

దీంతో భారతదేశం అంతటా కూడా అనేక చిరు వ్యాపార సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలియజేసింది.ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్ఫారం వేదికగా తెలియజేసింది.

ఇలాంటి దారుణమైన ప్రచారాలను ఇలాగే వదిలేస్తే మన ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడే విధంగా ఉంటుందని పోస్ట్ లో సాంప్రదాయ రిటైల్ ఎన్విరాన్మెంట్ సిస్టమ్ కు అంతరాయం కలిగించేందుకు చేసిన ప్రయత్నంగా అభివర్ణించిన ఏఐసీపీడీఎఫ్( AICPDF ) ఆందోళన వ్యక్తం చేసింది.దేశపు ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న 1.3 కోట్ల మంది రిటైలర్లు, 8 లక్షల మంది డిస్ట్రిబ్యూటర్లపై ఈ ప్రచారం బహిరంగ దాడిని సూచిస్తుందని సంస్థ తెలియచేసింది.ఇలాంటి యాడ్స్ ను అరికట్టడానికి తక్షణమే ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ సూచించింది.ముఖ్యంగా ప్రధాన నగరాలలో ఒకటి ఆయన హైదరాబాద్ లో ఫాస్ట్ డెలివరీ చేస్తూ స్విగ్గి, ఇన్‌స్టామార్ట్ కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకుంటా ఉంటుంది.2024లో 2కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్స్ చేసినట్టు ఒక ప్రముఖ కంపెనీ నివేదికలో తెలిపింది.

ఆ విషయంలో తండ్రిని మించి వ్యక్తి రామ్ చరణ్.. మల్లేశ్వర్రావు కీలక వ్యాఖ్యలు
Advertisement

తాజా వార్తలు