అయ్యబాబోయ్.. బిర్యానీని ఇంత సులువుగా చేస్తుందేంటి ఈ ఏఐ!

ఈ స్మార్ట్ యుగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఓ కొత్త మలుపు తిరుగుతోంది.ఒకప్పుడు కలలు కన్న విషయాలు ఇప్పుడు నిజం కావడం మామూలైపోయింది.

టెక్నాలజీ( Technology ) ప్రగతితో మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది.ఇంటి పని నుంచి పరిశోధనల వరకు, భవిష్యత్తు ఊహించలేనంతగా అభివృద్ధి చెందుతోంది.

ఒకప్పుడు మనం చూసిన ఆదిత్య 369 సినిమాలో వెనక్కి వెళ్లే యంత్రం ఊహగా కనిపించేది.ఇప్పుడు మాత్రం భవిష్యత్తులోకి ముందడుగు వేస్తూ, నిజంగా జీవితం స్మార్ట్‌గా మారిపోయింది.

ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI ) రాకతో పాత టెక్నాలజీ అన్నదే మరిచిపోయే స్థాయికి వచ్చింది.మనిషికి అవసరమైన ప్రతి పనిని వేగంగా, ఖచ్చితంగా, సమర్థంగా చేయగలిగే టెక్నాలజీగా AI రూపుదిద్దుకుంది.

Advertisement
Ai Powered Cooker Stuns Netizens By Instantly Making Biryani A Glimpse Into The

ఇప్పుడు అది కేవలం ఆఫీసులు, పరిశ్రమలు, ఆరోగ్యరంగం వరకు పరిమితంగా లేకుండా వంటింట్లోకి కూడా ప్రవేశించింది.నిజానికి వంట చేస్తే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

సరైన మోతాదులో మసాలాలు, ఉడక, రుచికి తగ్గ ఉప్పు.అన్నీ మనిషే చూసుకోవాలి.

కానీ ఇప్పుడు అది AI ఆధారిత కుక్కర్ చూసుకుంటోంది.సామాన్యంగా మనం బిర్యానీ( Biryani ) వండుకోవాలంటే ఎంతో సమయం, శ్రమ పెట్టాలి.

కానీ, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక AI కుక్కర్( AI Cooker ) కేవలం కొన్ని క్షణాల్లోనే బిర్యానీ వండేసింది.బియ్యం, మాంసం, మసాలా దినుసులు ఇలా కావలసినవన్నీ కుక్కర్ లో వేసి, టచ్ స్క్రీన్ పై మోతాదులు, ఉడక టైం సెటప్ చేయగానే, కుక్కర్ స్టెప్పుల వారీగా పని చేసి, రుచికరమైన బిర్యానీ తాయారు చేసింది.

Ai Powered Cooker Stuns Netizens By Instantly Making Biryani A Glimpse Into The
Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశర్యపోతున్నారు.మరికొందరేమో ఇది వరకు కేవలం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే కష్టం అన్నారు.ఇప్పుడు వంట వారికీ కూడా గడ్డు కాలమే అంటూ కామెంట్స్ చేతున్నారు.

Advertisement

మరికొందరేమో ఇలాంటి టెక్నాలజీతో ఇంట్లో పనులన్నీ చాలా సులువవుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ AI కుక్కర్లు ప్రారంభ దశలో ఉన్నా, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పనులను స్వయంగా చేయగలిగేలా అభివృద్ధి అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదే వేగంతో టెక్నాలజీ అభివృద్ధి చెందితే, వచ్చే రోజుల్లో వంటపై మనిషి ఆధారపడాల్సిన అవసరం ఉండకపోవచ్చు.కేవలం బటన్ నొక్కడమే సరిపోతుంది.అలాగే, మీకు నచ్చిన వంటకం ఎప్పుడైనా, ఎక్కడైనా AI ద్వారా తయారవుతుంది.

ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాధ్యమవుతోంది.ఇది కేవలం ప్రారంభం మాత్రమే.

రాబోయే కాలంలో AI మానవ జీవితాన్ని ఎలా మలుపుతిప్పుతుందో ఊహించలేము.కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితం, ఇది ఇక మానవ జీవితంలో భాగంగా మారిపోయింది.

తాజా వార్తలు