ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( BRS MLC Kavita ) బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనుంది.

ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ఈ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు ( Rouse Avenue Court )విచారణ చేపట్టనుంది.

లిక్కర్ పాలసీ ఈడీ మనీలాండరింగ్ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.తనపై అక్రమంగా కేసు పెట్టారని, ఈ వ్యవహారంలో తన పాత్రకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.

అఫ్రూవర్స్ గా మారిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసులో ఇరికించారని ఆమె తెలిపారు.అయితే లిక్కర్ కేసులో కవితే కింగ్ పిన్ అని ఈడీ ఆరోపిస్తుంది.

ఈ క్రమంలోనే ఆమె బయటకు వెళ్తే సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశమున్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరుతుంది.ఈ క్రమంలో కవితకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా ? అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు