పెళ్లి తర్వాత నయనతార సినిమాలు చెయ్యదా.. కాజల్ లానే నయన్ కూడా అన్నిటికి దూరం అవుతుందా?

టాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ బ్యూటి నటి నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.తను నటించే సినిమాల్లో పాత్రలకు ప్రాణం పోసినట్లుగా నటిస్తుంది నయన.

తన అందంతో ఎంతో మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హోదా లో నిలిచింది.ఎన్నో సినిమాలలో లేడి ఓరియెంటెడ్ పాత్రలలో నటించి గొప్ప టైటిల్ ను సొంతం చేసుకుంది.ఇక 2003 లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టగా.2006లో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయింది.కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ వంటి భాషల్లో కలిపి దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించింది.

ఇక ఈమె హీరోయిన్ గా కంటే వ్యక్తిగత విషయంలో కూడా బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.ప్రస్తుతం తను తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ నెల 9 న పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఈ జంట.ఇక విగ్నేష్ శివన్ కు ముందు కొన్ని వ్యక్తిగత విషయాలతో బాగా సమస్యలు ఎదురుకుంది.ఆ తర్వాత తాను నటించిన ఓ సినిమా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది.

Advertisement

ఆయనతో ప్రేమలో మునుగుతున్న నయన సోషల్ మీడియాలో తమకు సంబంధించిన ఫోటోలను తెగ పంచుకుంది.

అంతేకాకుండా సినిమా షూటింగ్ లో వారిద్దరు కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను అభిమానులతో బాగా పంచుకుంటారు.ఇక గతంలో వీరి పెళ్లి ముహూర్తాలు తేదీలు కూడా ప్రకటించగా.అవి కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డాయి.

మొత్తానికి ఇప్పటికి ముహూర్తం కుదిరింది.ఇక ఇప్పటికే వీరిద్దరు తమ పెళ్లి కార్డును తమ సన్నిహితులందరికీ పంచుకున్నారు.

ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు ఈ జంట.ఇక వీరి పెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘనంగా జరగనుంది.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

ఇదిలా ఉంటే ఈ అమ్మడు తన సినిమా తర్వాత సినిమాలు చెయ్యదని వార్తలు వినిపిస్తున్నాయి.గతంలో కూడా ఫ్యామిలీ ఎక్కువ సమయం కేటాయిస్తాను అని అనటంతో ఇప్పుడు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటుంది అని తెలుస్తుంది.కాజల్ కూడా తన పెళ్లి తర్వాత కమిట్మెంట్ సినిమాలలో మాత్రమే నటించగా ఇప్పుడు పూర్తిగా సినిమాలకు గుడ్బై చెప్పింది.

Advertisement

నయనతార కూడా సినిమాలకు గుడ్బై చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవలే విడుదలైన నయనతార తన ప్రేమికుడి విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాథువాకుల రెండ్ కాదల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది.ఇందులో సమంత కూడా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.అంతేకాకుండా రజినీకాంత్ సరసన మరో సినిమాలో నటిస్తుండగా.

మలయాళం మరో సినిమా లో నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి.ఇవన్నీ కమిట్మెంట్ సినిమాలు కాగా ఇకపై వచ్చే మరే సినిమాకు సైన్ చేయలేదు అని తెలుస్తుంది.

తాజా వార్తలు