2024 తరువాత ఎన్టీఆర్ అసలైన వారసులు వస్తారు..: కొడాలి నాని

టీడీపీ నేత నారా లోకేశ్ పై మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.టీడీపీకి నారా లోకేశ్ పెద్ద గుదిబండని విమర్శించారు.

లోకేశ్ కు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని ఎద్దేవా చేశారు.చంద్రబాబును కాంగ్రెస్ పార్టీ మంత్రిని చేస్తే టీడీపీలోకి రాలేదా అని ప్రశ్నించారు.

ఎన్టీఆర్ రొమ్ము గుద్ది పార్టీ లాక్కొలేదా అని నిలదీశారు.లోకేశ్ రెడ్ బుక్ చూసి ఎవడు భయపడతాడన్న కొడాలి నాని చంద్రబాబు కానీ లోకేశ్ కానీ తనను ఏమీ పీకలేరంటూ వ్యాఖ్యానించారు.2024 తరువాత ఎన్టీఆర్ అసలైన వారసులు వస్తారని తెలిపారు.పక్క దేశాల్లో బతికే యార్లగడ్డ కూడా తన గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తాను రంగా అభిమానినో కాదో రాధాను అడిగితే చెప్తారని స్పష్టం చేశారు.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు