దోమలే ఆ దేశస్తులకు ఆహారం

ఆసియా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా. ఈ ఖండాన్ని చీకటి ఖండంగా పిలుస్తుంటారు.

అక్కడి దేశాల్లో ఎన్నో విలువైన ఖనిజాలు లభిస్తాయి.బంగారం కూడా అక్కడి గనుల్లో అధిక మొత్తంలో లభిస్తుంటుంది.

అయినప్పటికీ అక్కడి ప్రజలకు తినడానికి కూడా తిండి ఉండదు.కడు దుర్భర పరిస్థితుల్లో వారు జీవనం సాగిస్తుంటారు.

తాజాగా వారు తినే ఆహారం గురించి బయటకు తెలిసింది.దోమలను పట్టుకు, వాటితో వేయించిన బర్గర్లను వారు తింటున్నట్లు బాహ్య ప్రపంచానికి వెల్లడైంది.

Advertisement

దీంతో ప్రజలంతా అవాక్కవుతున్నారు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఆఫ్రికా దేశాల్లోని ప్రజలను ప్రపంచంలోనే అతి తక్కువ ఆయుర్దాయం కలిగి ఉన్నారు.దీనికి ప్రధాన కారణం వారు తినే ఆహారంలో పోషకాలు లేకపోవడమే.

ఈ దుస్థితి నుంచి ఆ దేశ ప్రజలు బయటపడలేకపోతున్నారు.తినడానికి సరైన తిండి లేకపోతే ఆకలి ఆగదు.

అందుకోసం దొరికిన పదార్థాలతో ఆహారాన్ని తయారు చేసి తింటారు.ఇటీవల దోమలతో స్థానికులు బర్గర్లు తయారు చేసి తింటున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసీ హెచ్చరిక..!!
పర్షియన్ కార్పెట్ లాంటి కేక్ ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే ఫిదా..

ఇది విన్న వారిలో కొందరు దోమలు తింటున్నారా అని ఛీఛీ అంటూ ముఖం పెడుతున్నారు.మరి కొందరు వారి పరిస్థితితి ఎంత దీనంగా ఉందోనని అయ్యో అన్నారు.

Advertisement

ఆఫ్రికాలో ఎక్కడ చూసినా దోమలు కనిపిస్తాయి.మరీ ముఖ్యంగా వేసవి కాలంలో అధిక మొత్తంలో దోమలు సంచరిస్తుంటాయి.

అయితే దోమలను పట్టుకునేందుకు గిన్నెను ఉపయోగిస్తున్నారు.గిన్నెలకు దోమలు తగులుకుని, వాటి కళ్లు అందులో పడుతుంటాయి.

ఇలా గిన్నెలో పడిన దోమలన్నింటినీ ముద్దలా చేస్తారు.ఆ ముద్దను బయట రెస్టారెంట్లలో లభించే చికెన్ బర్గర్ల తరహాలో నూనెలో బాగా వేయిస్తారు.కరకరలాడే ఈ దోమల బర్గర్లను వారు ఎంతో ఇష్టంగా తింటారు.

వీటికి ఏ మాత్రం మసాలాలు అద్దకపోయినా ఎంతో రుచికరంగా ఉంటాయి.ఇలా ఒక్కో బర్గర్‌ను తయారు చేసేందుకు సుమారు 50 లక్షల దోమలు అవసరం పడతాయట.

అంత పెద్ద మొత్తంలో దోమలను పట్టుకుంటేనే వారికి తినడానికి తగిన ఆహారం దొరుకుతుంది.ఈ దోమల బర్గర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.

మాంసం, గుడ్లు వంటి వాటిలో కంటే ఈ దోమల బర్గర్‌లో 7 రెట్లు అధికంగా ప్రొటీన్లు ఉంటాయని తేలింది.అంతేకాకుండా త్వరగా జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు.

తాజా వార్తలు