అలాంటి సినిమాలు చేయొద్దని సలహా ఇచ్చారు... శివాత్మిక షాకింగ్ కామెంట్స్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వారసులు వారసురాలు రావడం సర్వసాధారణం.

ఈ క్రమంలోనే జీవిత రాజశేఖర్ ( Jeevitha Rajashekar)వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి శివాత్మిక రాజశేఖర్ ( Shivathmika Rajashekar ) .

దొరసాని సినిమా ( Dorasani Movie )ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి ఈమె అడపా దడపా సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడం కోసం కష్టపడుతున్నారు.ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి శివాత్మిక రాజశేఖర్ తాజాగా రంగమార్తాండ( Rangamarthanada ) సినిమాలో కూడా నటించిన విషయం మనకు తెలిసిందే.

Advised Not To Do Such Films Sivatmikas Shocking Comments ,jeevitha Rajashekar,k

కృష్ణ వంశీ( Krishnavamsi ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇందులో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజు కూతురి పాత్రలో శివాత్మిక నటించారు.ఇక ఈ సినిమాలో ఈమె నటన అద్భుతం అని చెప్పాలి.

కొన్ని సన్నివేశాలలో ఈమె నటన చేత అందరిని కంటతడి పెట్టించారు.ఇలా రంగమార్తాండ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన శివాత్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

Advertisement
Advised Not To Do Such Films Sivatmikas Shocking Comments ,Jeevitha Rajashekar,K

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా శివాత్మిక మాట్లాడుతూ.తాను రంగ మార్తాండ సినిమాలో కూతురి పాత్రలో నటించబోతున్నానని తెలియడంతో చాలామంది నాకు ఈ సినిమాని చేయొద్దు అంటూ సలహా ఇచ్చారని తెలిపారు.

Advised Not To Do Such Films Sivatmikas Shocking Comments ,jeevitha Rajashekar,k

ఇలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తే కెరియర్ మొత్తం దెబ్బతింటుందని ఇలాంటి సినిమాలను ఎవరు చూడరు ఇలాంటి సినిమాలలో నటిస్తే హీరోయిన్గా అవకాశాలు పోతాయని చాలామంది ఈ సినిమా చేయొద్దు అంటూ తనకు సలహా ఇచ్చారని తెలిపారు.అయితే ఇప్పుడు ఈ సినిమాని తనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని శివాత్మిక వెల్లడించారు.ఇక కెరియర్ మొదట్లో దొరసాని సినిమా అవకాశం రావడంతో తాను సినిమాల గురించి ఎన్నో ఊహించుకున్నానని తెలిపారు.

ఇక వరుసగా సినిమాలు చేస్తూ పోవడమే అనుకున్నాను కానీ కొంతకాలం పాటు తనకు గ్యాప్ వచ్చిందని,ఇండస్ట్రీలో కొనసాగడం తాను అనుకున్నంత ఈజీ కాదని ఇప్పుడు అర్థం అయింది అంటూ ఈ సందర్భంగా శివాత్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు