చెప్పులు లేకుండా నడిస్తే ఎన్ని లాభాలో చూడండి

కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళితే, మనుషులు చెప్పులు లేకుండానే నడిచేవారు.కాలక్రమంలో జంతువుల చర్మంతో పాదరక్షలు ధరించడం మొదలుపెట్టారు.

మట్టి, గడ్డి, రాయి .ఇలా అన్నిటిని ఆస్వాదించాయి వారి పాదాలు.వారిలా మనం ఇప్పుడు చెప్పులు లేకుండా నడవాలంటే చాలా కష్టమైన విషయం అయినా, ఇంటిదగ్గర బీచ్ ఉంటే, లేదా మన ఇంట్లో చిన్న గార్డెన్ ఉంటే, లేదంటే పార్క్ లో అయినా, చెప్పులు వదిలేసి నడవడానికి ఏమి ఇబ్బంది ఉండదు.

Advantages Of Walking Barefoot-Advantages Of Walking Barefoot-Telugu Health - �

అలా ఎందుకు నడవాలి అని అడుగుతున్నారా ? * చెప్పులు లేకుండా నడవడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ చాలావరకు మెరుగుపడుతుందని, శరీరభాగాలకు రక్తం బాగా అందుతుందని, అలాగే పలురకాల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం గణనీయంగా పడిపోతుందని ఎన్నో పరిశోధనలు తేల్చిచెప్పాయి.* చెప్పులు లేకుండా గడ్డి మీద నడవడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు అని పరిశోధకులు చెబుతున్నారు.

ఇలా నడవడం ద్వారా నిద్రకు అవసరమైన నెగెటివ్ అయాన్స్ పెరిగి, సుఖమైన నిద్ర మన సొంతమవుతుందట.* మన పాదాల్లో పదిహేను వేలకు పైగా నేర్వ్ ఎండింగ్స్ ఉంటాయి అంటా.

Advertisement

ఆ రిఫ్లేక్స్ పాయింట్స్ ని మనం స్టిములేట్ అవకుండా చెప్పులతో ఆపేస్తున్నాం.చెప్పులు లేకుండా రాళ్ళు, రప్పలపై నడిస్తే, ఈ నేర్వ్ ఎండింగ్స్ ఛార్జ్ అవుతాయి అన్నమాట.

* ఎలాంటి పాదరక్షలు లేకుండా గడ్డిపై నడవడం ద్వారా ఎండార్ఫిన్స్ హార్మోన్స్ బాగా విడుదల అవుతాయి.తద్వారా ఒత్తిడి, ఇతర మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందినట్టుగా ఉండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

* చెప్పులు, బూట్లు ధరించడం వలన పాదాలకి ఎక్కడలేని స్ట్రెస్ ని ఇస్తున్నాం మనం, ఇది పాదాలు, వెన్నుముక్క, మెదడుపై ఒత్తిడి తీసుకువస్తుంది.కాబట్టి వీలుచిక్కినప్పుడల్లా చెప్పులు లేకుండా నడవండి.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు