Medigadda Barrage : మేడిగడ్డ బ్యారేజ్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా

మేడిగడ్డ బ్యారేజ్( Medigadda Barrage ) వ్యవహారంపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

బ్యారేజ్ పిల్లర్లు కుంగడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ కోరింది.

సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వం కోరింది.అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై( Kaleshwaram project ) ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించామని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది.

విజిలెన్స్ రిపోర్ట్ తరువాత ఇంజినీర్లను విధుల నుంచి తొలగించామని పేర్కొంది.ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తరువాత మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగడానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.

అలాగే ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాశామన్న సర్కార్ ఎన్డీఎస్ఏ ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పింది.దీంతో సెంట్రల్ వాటర్ కమిషన్ ను ఇంప్లీడ్ చేయాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశించింది.

Advertisement

అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు