Adivi sesh hit 2 :హిట్ 2 హిట్ అయితే ఏం జరుగుతుందో తెలుసా...!

విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

హిట్‌ తెలుగు లో మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో హిందీలో కూడా రీమేక్ అయిన విషయం తెల్సిందే.

హిందీలో రీమేక్ అయిన హిట్‌ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.హిందీ తో పాటు ఇతర భాషల్లో హిట్‌ సినిమాకు దక్కిన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు హిట్ 2 సినిమా రాబోతుంది.అడవి శేష్‌ హీరోగా రూపొందిన హిట్ 2 సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

శైలేష్ కొలను మరో ఆసక్తికర కేసు తో ఈ సినిమాను రూపొందించాడు అంటూ టీజర్ మరియు ట్రైలర్‌ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా హిట్ అయితే కచ్చితంగా హిందీలో రీమేక్ అవ్వకుండా దీన్నే అక్కడ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

మేజర్ సినిమా తో అక్కడ మంచి పాపులారిటీని సొంతం చేసుకున్నాడు.కనుక హిందీ లో హిట్‌ 2 తో అడవి శేష్‌ వెళ్తే కచ్చితంగా పాన్‌ ఇండియా మూవీ అన్నట్లుగా సక్సెస్ చేస్తారనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

శైలేష్ కొలను దర్శకత్వంలో నాని ఈ రెండవ హిట్‌ ను నిర్మించాడు.హిట్‌ 2 విడుదల అయ్యి సక్సెస్ టాక్‌ దక్కించుకుంటే కచ్చితంగా భారీ ఎత్తున వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది.

అంతే కాకుండా హిట్‌ 2 కి సీక్వెల్‌ గా హిట్‌ 3 కూడా వస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఈసారి నాని కేవలం నిర్మాతగా ఉండకుండా కీలక పాత్రలో నటించేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.హిట్ సీక్వెల్స్ బ్యాక్‌ టు బ్యాక్ వస్తాయంటూ ఇప్పటికే చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించిన విషయం తెల్సిందే.

అక్కినేని ఫ్యామిలీ హీరోలకు ముందుకి వెళ్లే ఛాన్స్ లేదా??
Advertisement

తాజా వార్తలు