కాసేపట్లో నిర్దేశిత కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 వ్యోమనౌక

ఇస్రో మరో మైలురాయిని చేరుకోబోతుంది.సూర్యునిపై పరిశోధనల కోసం పంపిన ఆదిత్య ఎల్-1 వ్యోమనౌక మరికాసేపటిలో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించనుంది.

మరి కాసేపటిలో గమ్యస్థానానికి చేరనున్న ఆదిత్య ఎల్-1 మొత్తం 126 రోజులపాటు ప్రయాణించింది.ఇప్పటికి నాలుగు దశలను దాటి వెళ్లిన ఆదిత్య ఎల్ -1 సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత ఆదిత్య ఎల్-1 వ్యోమనౌక వచ్చే ఐదేళ్ల పాటు సూర్యుడిపై అధ్యయనం చేయనుంది.గత ఏడాది సెప్టెంబర్ 2వ తేదీన ఏపీలోని శ్రీహరికోట నుంచి ఆదిత్య ఎల్-1 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే.

చైనా: యూట్యూబర్‌కు షాకింగ్ అనుభవం.. మంటలు షూట్ చేసిన రోబో డాగ్‌..?
Advertisement

తాజా వార్తలు