నటుడు సిద్ధార్థ్ తో రిలేషన్ పై స్పందించిన అదితి.. మీరే ఓ అభిప్రాయంలో ఉన్నారంటూ కామెంట్స్?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి అదితి రావు హైదరి( Aditi Rao Hydari )ఒకరు.

అయితే గత కొద్ది రోజులుగా ఈమె నటుడు సిద్ధార్థ్( Siddharth ) తో రిలేషన్ లో ఉన్నారనీ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే వార్తల గురించి ఇదివరకే స్పందించి అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు.అయితే వీరి వ్యవహార శైలి చూస్తే మాత్రం వీరి మధ్య ఏదో ఉందంటూ అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటికి మరోసారి ఇదే ప్రశ్న ఎదురయింది.

ఇటీవల ఆమె నటించిన తాజ్ సినిమా( Taj movie ) విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని అంతకుంది.ఈ సందర్భంగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే యాంకర్ తను రిలేషన్ లో ఉన్న విషయంపై స్పందించాలని కోరగా వెంటనే ఈమె సమాధానం చెబుతూ తాను ఏ విషయాన్నైనా అందరితో పంచుకోవాల్సింది అయితే తప్పకుండా అందరితో చెబుతానని తెలిపారు.

Advertisement

ఇక రిలేషన్షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఒక్కో విషయంపై ఆసక్తి ఉంటుంది కొందరికి ఇలాంటి విషయాలపై ఆసక్తి ఉంటే మరికొందరికి మమ్మల్ని స్క్రీన్ పై చూడాలని ఆసక్తి ఉంటుంది.

ఇలా వారి కోరిక మేరకే మేము మరింత కష్టపడి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో మీ ముందుకు రాగలమని తెలిపారు.ఇక నటుడు సిద్ధార్థ్ తో రిలేషన్ గురించి ప్రశ్నించగా ఈ విషయం గురించి మీరే ఒక అభిప్రాయం లో ఉన్నారు అంటూ ఈమె షాకింగ్ సమాధానం చెప్పారు.ఇక ఈ విషయం గురించి నేనేం చెప్పాలి నేనేం చెప్పినా కూడా మీరు మీకు నచ్చిన విధంగా ఊహించుకుంటారు అంటూ ఈమె సిద్ధార్థ్ తో రిలేషన్ లో ఉన్నారంటూ వచ్చే వార్తలపై మరోసారి స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశారు.

ఇలా నటి అదితి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు