ప్రభాస్(Prabhas) కృతి సనన్(Kriti Sanon) జంటగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఆది పురుష్(Adipurush) .
ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషలలో ప్రేక్షకుల ముందు రాబోతుంది.
ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోని డివోషనల్ సిటీ (Devotionla City)గా పేరు ప్రఖ్యాతలుగా అంచునటువంటి తిరుపతి (Tirupathi)లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు సినీ సెలబ్రిటీలు హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి హాజరయ్యారు.
ఇకపోతే ఈ సినిమాలో సీత పాత్రలో నటించినటువంటి నటి కృతి సనన్ బ్లాక్ చీరలో ఎంతో అందంగా ముస్తాబయి సందడి చేశారు .ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ నా సినీ కెరియర్ తెలుగులోనే మొదలైంది అయితే తొమ్మిది సంవత్సరాల తర్వాత ఆది పురుష్ సినిమా ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని తెలిపారు.
ఈ సినిమాలో జానకి(Janaki) పాత్రలో చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టం.ఇలాంటి ఓ గొప్ప పాత్రకు నన్ను ఎంపిక చేసినందుకు దర్శక నిర్మాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
నా జీవితంలో ఈ సినిమా ఒక గొప్ప ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందని కృతి వెల్లడించారు.సాధారణంగా సినిమా షూటింగ్ జరిగే సమయంలో సెట్ మొత్తం చాలా గోలగోలగా ఉంటుంది కానీ ఈ సినిమా రామాయణం తరహాలో తెరకెక్కిన నేపథ్యంలో షూటింగ్ లొకేషన్లో చాలా ప్రశాంతకరమైన వాతావరణం ఉండేదని ఈమె తెలియజేశారు.ఇక యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep) ప్రభాస్ గురించి కూడా మాట్లాడండి అని చెప్పడంతో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.
ప్రభాస్ స్వీట్ అండ్ కైండ్ పర్సన్(Sweet And Kind Person) .ఈయన ఫుడ్ చాలా ఇష్టపడతారు.ఇక ప్రభాస్ పెద్దగా మాట్లాడారని అందరూ భావిస్తారు.
అయితే అది నిజం కాదని ప్రభాస్ విషయంలో మీరు అనుకున్నది పొరపాటని ఆయన చాలా బాగా మాట్లాడతారని తెలియజేశారు.ఈ సినిమాలో రాఘవుడి (Raghava) పాత్ర ప్రభాస్ తప్ప మరెవరు చేయలేరంటూ ఈ సందర్భంగా కృతి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy