బన్నీని ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ( Allu family ) అంటూ ట్రోల్స్ నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

ఒకరిపై ఒకరు దారుణంగా రెచ్చిపోయి మరి కామెంట్స్ చేసుకుంటున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కామెంట్స్ పై జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు.తాజాగా శివం భజే సినిమా( Shivam Bhaje movie ) ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న హైపర్ ఆది అల్లు అర్జున్ గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.అల్లు అర్జున్‌ నేషనల్‌ అవార్డు విన్నర్‌.

ఆయన్ని అందరూ గౌరవించాలి.మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే.

Advertisement

కొంతమంది అల్లు అర్జున్‌( Allu Arjun ) ను ఉద్దేశపూర్వకంగా ట్రోల్‌ చేస్తున్నారు.థంబ్‌ నెయిల్స్‌ కూడా పెడుతున్నారు.దయచేసి అలా చేయవద్దు.

ఇక నుంచైనా ఇలాంటివి ఆపేయాలని మానస్ఫూర్తిగా కోరుతున్నాను అని చెప్పుకొచ్చారు హైపర్ ఆది.ఈ సందర్భంగా ఆది చేసిన వ్యాఖ్యలు చేసిన సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఆది చేసిన వాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు పాజీటివ్ గా స్పందిస్తున్నారు.

అనంతరం హైపర్ ఆది మాట్లాడుతూ.పవన్‌ కల్యాణ్‌( Pawan Kalyan ) అంటే నాకు చాలా ఇష్టం.ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తాను.

బాధలో ఉంటే దగ్గరకెళ్లి చూసుకుంటాను అని తెలిపారు.పవన్‌ కల్యాణ్‌ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను అని అన్నారు.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

తనకు ఎమ్మెల్సీ ఇస్తారంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు హైపర్ ఆది.ఇకపోతే హైపర్ ఆది విషయానికి వస్తే.ఆది ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు