Adhik Ravichandran Aishwarya : అంగరంగ వైభవంగా తమిళ నటుడు ప్రభు కుమార్తె వివాహం… ఫోటోలు వైరల్!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు లేదా సెలబ్రిటీ పిల్లలు పెద్ద ఎత్తున పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు.

ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి హీరోలు పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టగా మరి కొంతమంది స్టార్ సీనియర్ హీరోల పిల్లలు కూడా నిశ్చితార్థం జరుపుకొని పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ప్రముఖ కోలీవుడ్ నటుడు ప్రభు( Prabhu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈయన తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితమే.ఇలా తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తున్నట్టుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభు కుమార్తె ఐశ్వర్య ( Aishwarya ) గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అధిక రవిచంద్రన్ ( Adhik Ravichandran ) తో నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా వీరి నిశ్చితార్థపు ఫోటోలు కూడా ఇదివరకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.అయితే తాజాగా నేడు చెన్నైలో వీరి వివాహ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.

ప్రస్తుతం ఐశ్వర్య అధిక్ రవిచంద్రన్ వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఇలా సోషల్ మీడియా వేదికగా హీరో విశాల్( Vishal )వీరి పెళ్లి ఫోటోలను షేర్ చేశారు ఈ పెళ్లి వేడుకలకు హాజరైనటువంటి ఈయన నూతన వధూవరులతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా డైరెక్టర్ అది రవిచంద్రన్ కు తన చెల్లెలు ఐశ్వర్యను మహారాణి లాగా మంచిగా చూసుకోవాలని కూడా సలహాలు ఇచ్చారు.మీరు బాగా చూసుకుంటారు అన్న విషయం నాకు తెలుసు కానీ సరదాగా చెప్పాను అదేంటో నాకు వరుసకు చెల్లెలు అయ్యే వారందరి పేరు కూడా ఐశ్వర్యనే అంటూ ఈయన ఈ దంపతులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పెళ్లి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే ఐశ్వర్యకు ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.ప్రభు కుమార్తె ఐశ్వర్యకు ఇదివరకే వివాహం జరిగింది.

ఈమెకు 2009వ సంవత్సరంలో తమ సమీప బంధువు కునాల్ అనే వ్యక్తితో వివాహం జరిగింది పెళ్లి తర్వాత ఈమె తన భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.

అయితే తన భర్తతో వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా ఐశ్వర్య తనకు విడాకులు ఇచ్చి తన తండ్రి వద్దకు వచ్చేసారు ఇలా తండ్రి చెంతనఉన్నటువంటి ఐశ్వర్య అధిక్ రవిచంద్రన్ ప్రేమలో పడటంతో ప్రభు వీరిద్దరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.దీంతో వీరిద్దరూ నేడు పెళ్లి పీటలు ఎక్కారు.ఇక ఈయన డైరెక్టర్గా పలు కోలీవుడ్ బాలీవుడ్ సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు