వ్యవసాయం( Agriculture )లో ఎప్పుడు ఒకే రకమైన పంటలు కాకుండా వివిధ రకాల పంటలు సాగు చేస్తేనే ఆశించిన స్థాయిలో లాభాలు పొందవచ్చు.
అయితే తక్కువ నీటి వనరులు ఉండే ప్రాంతాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసి అధిక లాభాలు పొందుతున్నారు కొంతమంది రైతులు.
ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ( Dragon Fruit )సాగు మరింత సులభతరంగా మారింది.ట్రెల్లిస్ విధానంలో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగు అవుతోంది.
ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటను సాలుకు, సాగుకు మధ్య 14 అడుగులు, దిమ్మెకు, దిమ్మెకు మధ్య 14 అడుగుల దూరం ఉండేటట్లు పోల్స్ నాటుకోవాలి.పోల్స్ విద్యుత్ లైన్ తరహాలో నాలుగు వరుసలతో లైన్ వేయాలి.
ఎలాగంటే.పోల్స్ కింద ఒకదాని పైన ఒకటి ప్రకారం మూడు వైర్లు లాగాలి.
ఇక పోల్స్ పక్కన డ్రాగన్ ఫ్రూట్ నాటుకుంటే అవి తీగల తరహాలో పైకి పెరుగుతూ నాలుగు లైన్ల తీగలపై అల్లుకుంటాయి.ఒక ఎకరం పొలంలో దాదాపుగా నాలుగు వేలకు పైగా మొక్కలు నాటుకోవచ్చు.
ఇక రెండు సాలుల మధ్య 14 అడుగుల దూరం ఉండడంతో ట్రాక్టర్ తో సేద్యం చేసి వివిధ రకాల అంతర పంటలు సాగు చేసుకోవచ్చు.వేరుశనగ, మినుములు, పెసలు లాంటి పంటలతో పాటు కూరగాయలు కూడా పండించుకోవచ్చు.ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ పంటకు మల్చింగ్ సదుపాయం కల్పించుకుంటే దాదాపుగా కలుపు సమస్య కూడా ఉండదు.
పైగా మల్చింగ్ సదుపాయం వల్ల భూమిలో తేమ కూడా ఆరిపోదు.ఈ మల్చింగ్ వల్ల మొక్క ఆరోగ్యకరంగా పెరుగుతుంది.
ఇక సేంద్రియ ఎరువులకే ( organic fertilizers )అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్ ఎరువులు అధిక మోతాదులో ఉపయోగిస్తే నేల భూసారం పెరిగి నాణ్యత ఉండే పంట దిగుబడి పొందవచ్చు.ఒక ఎకరం పొలానికి దాదాపుగా రూ.10 లక్షల పెట్టుబడి వ్యయం అవుతుంది.మొదట ఏడాది నుంచి పంట చేతికి రావడం ప్రారంభమవుతుంది.
రెండు లేదా మూడు కోతలలో పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుంది.తర్వాత వచ్చే కోతలన్ని ఆదాయమే.
ఇక అంతర పంటల ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy