Adynamia : ఎప్పుడు నీరసంగా ఉంటుందా, తక్కువ బరువుతో బాధపడుతున్నారా.. అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఇది ఉండాల్సిందే!

ప్రస్తుత రోజుల్లో అధిక బరువు( overweight ) అనేది అతి పెద్ద శత్రువు గా మారింది.

బరువు తగ్గడం కోసం తంటాలు పడుతున్నవారు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు.

అయితే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారే కాదు బ‌రువు పెరగాలని ట్రై చేస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు.అధిక బరువు ఎంత ప్రమాదకరమో.

తక్కువ బరువు కలిగి ఉండటం కూడా అంతే ప్రమాదకరం.తక్కువ బరువు ఉన్నవారు ఎప్పుడు నీరసంతో బాధపడుతుంటారు.

బక్కగా, బలహీనంగా ఉంటారు.ఈ క్రమంలోనే బరువు పెరగడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు.

Advertisement

అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే స్మూతీ గ్రేట్ గా హెల్ప్ చేస్తుంది.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక తీసుకుంటే నీరసం( adynamia ) పరారవుతుంది.

అదే సమయంలో హెల్తీగా బరువు పెరుగుతారు.మరి లేటెందుకు వెయిట్ గెయిన్ కు సహాయపడే ఆ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగలు( Peanuts ), వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు( Pumpkin seeds ) వేసి వాటర్ తో ఒకసారి వాష్ చేసుకోవాలి.ఆపై ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు మరొక బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్లు రోల్డ్ ఓట్స్ వేసి ఒక కప్పు వాటర్ పోసి అర గంట పాటు నానబెట్టాలి.ఆపై వాటర్ ను తొలగించి ఓట్స్ ను పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో ఓట్స్ వేసుకోవాలి.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

అలాగే నానబెట్టుకున్న వేరుశెనగలు, గుమ్మడి గింజలు వాటర్ లేకుండా వేసుకోవాలి.వీటితో పాటు ఒక అరటిపండు, రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు( Dates ), వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

Advertisement

తద్వారా మన స్మూతీ రెడీ అవుతుంది.

ఈ ఓట్స్ పీనట్ బనానా స్మూతీ ఎంతో రుచికరంగా ఉంటుంది.అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా తక్కువ బరువు ఉన్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ స్మూతీని తీసుకుంటే కనుక శరీరానికి కేలరీలు పుష్కలంగా అందుతాయి.

ఆరోగ్యంగా బ‌రువు పెరుగుతారు.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

బలహీనత దూరమవుతుంది.ఎంతో యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా మారతారు.

కాబ‌ట్టి, బ‌రువు పెర‌గాల‌ని భావిస్తున్న‌వారు వారానికి మూడు, నాలుగు సార్లు త‌ప్ప‌క ఈ స్మూతీని తీసుకోండి.

తాజా వార్తలు