చలికాలంలో ఆరోగ్యానికి అండగా నిలిచే మూడు రకాల ఊరగాయలు ఇవే!

చలికాలం వస్తూ వస్తూనే ఎన్నో రోగాలను కూడా మూట కట్టుకుని తెస్తుంది.

అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

అయితే చలికాలంలో ఆరోగ్యానికి అండగా నిలిచే ఆహారాలు కొన్ని ఉన్నాయి.వాటిలో ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఊరగాయలు కూడా ఒకటి.

సాధారణంగా పిల్లల నుంచి పెద్ద వరకు పచ్చళ్ళు అంటే అమితమైన ఇష్టాన్ని ప్రదర్శిస్తుంటారు.అయితే రుచి పరంగానే కాదు పచ్చళ్ళు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

ముఖ్యంగా చలికాలంలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన పచ్చళ్ళు కొన్ని ఉన్నాయి.అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఉసిరికాయ ఊరగాయ( Amla Pickle )చలికాలం తినడానికి సరైన సీజన్ గా చెప్పుకోవచ్చు.కారం, పులుపు, వ‌గ‌రు రుచులతో ఉసిరికాయ ఊరగాయ చాలా టేస్టీగా ఉంటుంది.యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ డయాబెటిక్ లక్షణాలను ఉసిరికాయ కలిగి ఉంటుంది.

అలాగే ఉసిరికాయలో విటమిన్ సి మెండుగా ఉంటుంది.ఆహారంలో ఉసిరిని జోడించడానికి ఒక సులభమైన మార్గం ఊరగాయ.

చలికాలంలో ఉసిరికాయ ఊర‌గాయ‌ను తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్( Immunity power ) పెరుగుతుంది.ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం లభిస్తుంది.

అలాగే చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఊరగాయల్లో క్యారెట్ ఊరగాయ( Carrot Pickle ) ఒకటి.అందరూ మెచ్చే విధంగా ఉండే క్యారెట్ ఊరగాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.క్యారెట్‌ లో కార్బోహైడ్రేట్స్, కేలరీలు తక్కువగా ఉంటాయి.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి.చలికాలంలో క్యారెట్ ఊరగాయ తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ చురుగ్గా మారుతుంది.

Advertisement

రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

శరీరానికి చక్కని వెచ్చదనం కూడా లభిస్తుంది.ఇక చలికాలంలో తప్పక ట్రై చేయాల్సిన ఊరగాయల్లో నిమ్మకాయ ఊరగాయ( Preserved lemon ) కూడా ఉంది.

నిమ్మకాయ ఊరగాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, ఇది కాల్షియం ఆధారిత మూత్రపిండాల్లో రాళ్లను కరిగించడానికి సహాయపడుతుందని నిరూపించబడింది.పైగా నిమ్మకాయ ఊరగాయను తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

అనేక జబ్బుల నుంచి మనల్ని దూరంగా ఉంచుతుంది.

తాజా వార్తలు