అధిక రక్తపోటుతో చింతేలా.. బ్రేక్ ఫాస్ట్ లో దీన్ని చేర్చుకుంటే దెబ్బకు కంట్రోల్ అవుతుంది!

అధిక రక్తపోటు( high blood pressure ).మనలో చాలా మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.

అధిక రక్తపోటు చిన్న సమస్యగానే అనిపించినా చాలా ప్రమాదకరమైనది.గుండెపోటుతో సహా అనేక జబ్బులకు అధిక రక్తపోటు కారణం అవుతుంది.

కాబట్టి బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడం ఎంతో అవసరం.అయితే అందుకు కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.

అటువంటి ఆహారాల్లో ఫూల్ మఖానా( Fool Makhana )(తామ‌ర గింజ‌లు) ఒకటి.మఖానా లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది.

Advertisement

మరియు సోడియం తక్కువగా ఉంటుంది.అందువల్ల ఇవి అధిక రక్తపోటు ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంటాయి.

మఖానా రక్తపోటు నియంత్రణ లో అద్భుతంగా సహాయపడుతుంది.అయితే మఖానాను ఎక్కువ శాతం మంది ఈవినింగ్ స్నాక్స్ గా తింటారు.

కానీ మఖానా తో స్మూతీ తయారు చేసుకుని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే మరిన్ని ఆరోగ్య లాభాలు పొందుతారు.మఖానా తో రకరకాలుగా స్మూతీలు తయారు చేసుకోవచ్చు.

అయితే అధిక రక్తపోటుతో చింతిస్తున్న వారికి మఖానా రాగి స్మూతీ చాలా మేలు చేస్తుంది.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

నీచుడా.. మూత్రం చేసిన చేతులతో పండ్ల వ్యాపారం..(వీడియో)
Top 10 Richest Tollywood Celebrities

వాటర్ మరిగేలోపు రెండు స్పూన్ల రాగి పిండిని( Ragi flour ) అరకప్పు వాటర్ లో వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి.ఈ రాగి మిశ్రమాన్ని మరుగుతున్న నీటిలో వేసి దాదాపు 8 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Advertisement

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు వేయించిన మఖానా వేసుకోవాలి.అలాగే ఉడికించి చల్లార‌బెట్టుకున్న రాగి మిశ్రమం తో పాటు నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, అర కప్పు యాపిల్ ముక్కలు( Apple slices ), హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి మరియు ఒక గ్లాస్ పాలు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మన మఖానా రాగి స్మూతీ సిద్ధం అవుతుంది.మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని కనుక చేర్చుకుంటే అధిక రక్తపోటు దెబ్బకు కంట్రోల్ అవుతుంది.

అంతేకాదు ఈ మఖానా రాగి స్మూతీ ఒంట్లో అధిక వేడిని తొలగిస్తుంది.నీర‌సాన్ని త‌రిమికొడుతుంది.వెయిట్ లాస్ అవ్వడానికి తోడ్పడుతుంది.

ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది.పైగా మఖానా మగవారికి చాలా మంచిది.

ఇది స్పెర్మ్ పరిమాణం మరియు నాణ్యత రెండింటినీ పెంచుతుంది.మఖానా పునరుత్పత్తి వ్యవస్థకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

తాజా వార్తలు