మొదటి భర్తతో అందుకే విడిపోయా.. ఒంటరితనంతో డిప్రెషన్.. ఊర్వశి సంచలన వ్యాఖ్యలు!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో ఊర్వశి ( Urvashi )ఒకరు.

తాజాగా ఊర్వశి ఒక సందర్భంలో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఊర్వశి ఇప్పటివరకు 700కు పైగా సినిమాలలో నటించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో ప్రశంసలతో పాటు విజయాలను అందుకున్నారు.

కొన్ని సినిమాలలో ఊర్వశి హీరోయిన్ పాత్రలో సైతం నటించడం గమనార్హం.కొన్ని సినిమాలలో కామెడీ రోల్స్ లో సైతం నటించి ఊర్వశి 2000 సంవత్సరంలో ఊర్వశి మనోజ్.కె.జయన్( Manoj K Jayan ) ను పెళ్లి చేసుకోగా ఈ దంపతులకు తేజ లక్ష్మి అనే కూతురు పుట్టుక పుట్టింది.అయితే పెళ్లి తర్వాత ఈ దంపతుల మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చాయి.2008 సంవత్సరంలో ఊర్వశి తన భర్తతో విడాకులు తీసుకున్నారు.ఆ తర్వాత ఊర్వశి శివప్రసాద్( Siva Prasad ) అనే చెన్నైవాసిని మళ్లీ పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు ఇషాన్ ప్రజాపతి అనే కొడుకు ఉన్నాడు.అయితే ఊర్వశి తన మొదటి పెళ్లి గురించి, విడాకుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.మనోజ్ నేను విడిపోవడానికి కారణం తాగుడు అలవాటు అని ఆమె తెలిపారు.

Advertisement

భర్త ఇంట్లో అందరూ మద్యం తాగుతారని ఊర్వశి కామెంట్లు చేయడం గమనార్హం.

కుటుంబమంతా కలిసి మందు తాగుతారని నన్ను కూడా మందు తాగమని బలవంతం చేసేవారని ఊర్వశి చెప్పుకొచ్చారు.రోజూ మద్యం తాగి నేను కూడా తాగుబోతు అయ్యానని అదే మా విడాకులకు కారణమైందని ఆమె పేర్కొన్నారు.నా కూతురిని కూడా నాకు దక్కకుండా చేశారని ఊర్వశి తెలిపారు.

నా కూతురి బాధ్యతలను మొదటి భర్త తీసుకోవడంతో నేను ఒంటరిదాన్ని కావడంతో పాటు డిప్రెషన్ లోకి వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.

గర్భవతుల్లో బీపీ పెరగకూడదు అంటే చేయాల్సిన పనులు
Advertisement

తాజా వార్తలు