ఒకప్పటి నటి 'టబు' పెళ్లిచేసుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా.? ఆ టాప్ హీరో అంట..!

టబు హైదరాబాదులో పుట్టి ముంబైలో స్థిరపడిన సినిమా నటి.

దివ్యభారతి ద్వారా దర్శకుడు రాఘవేంద్రరావుకు పరిచయం కాబడి తద్వారా కూలీ నెంబర్ వన్ చిత్రంతో తెలుగుతెరపై తెరంగేట్రం చేసింది.

అంతలోనే హిందీ చిత్రాలతో మరింత బిజీ అయిపోయింది.విజయ్‌పథ్లో అజయ్ దేవగణ్ సరసన నటించి తొలి విజయాన్నందుకొంది.

ఇక ఆ చిత్రం తర్వాత మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.సాజన్ చలే ససురాల్, జీత్ చిత్రాలు ఆమెని స్టార్ కథానాయికని చేశాయి.90వ దశకమంతా బాగా కలిసొచ్చింది.అటు గ్లామర్ పాత్రలతోనూ, ఇటు నటనకు ప్రాధాన్యమున్న కథల్లోనూ నటించింది.

హిందీలో చేసిన మ్యాచిస్ చిత్రం టబుకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.పంజాబీ మహిళ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

ఆ వెంటనే ప్రియదర్శన్ దర్శకత్వంలో కాలాపానీ చేసింది.అది కూడా గుర్తింపును తీసుకురావడంతోపాటు తమిళంలో అవకాశాల్ని తెచ్చిపెట్టింది.

కథానాయికగా టబు తెలుగుపై చెరగని ముద్ర వేసింది.చేసింది తక్కువ సినిమాలే అయినా.టబు అనగానే తెలుగు ప్రేక్షకులు మా కథానాయికే అంటుంటారు.

కూలీ నెంబర్ 1 తర్వాత చాలా రోజులకి నిన్నే పెళ్లాడతాలో నటించింది.సినిమాలో నాగార్జునతో టబు కెమిస్ట్రీ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకొన్నారు.

ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, ఆవిడా మా ఆవిడే, అందరివాడు, పాండురంగడు, ఇదీ సంగతి తదితర చిత్రాల్లో నటించి అలరించింది.

అరటిపండు తినండి .. ఈ రోగాలకు దూరంగా ఉండండి

మంచి కెరీర్ ను బిల్డ్ చేసుకున్న టబు పెళ్ళిమాత్రం చేసుకోలేదు.దీనికి కారణం ఓ హీరో అంటోంది టబు.ఆ హీరో ఎవరా ఆమెను ప్రశ్నించగా అజయ్ దేవగన్ అని చెప్పేసింది.తన సోదరుడికి అజయ్ బంధువు అవుతాడట.

Advertisement

దాంతో ‘చిన్నప్పటినుంచి అజయ్ తమతోనే ఉండేవాడు.తామిద్దరం 25 ఏళ్లు స్నేహితులుగా ఉన్నాం.

అజ‌య్ కార‌ణంగానే నేను పెళ్లి చేసుకోలేదు.అలాగ‌ని, పెళ్లి చేసుకోనందుకు నాకేం బాధ లేదు’ అని చెప్పింది టబు.అయితే ఈ విషయాన్నీ ఎక్కడా తాను వ్యక్తపరచలేదని.కానీ ఎప్పుడైనా చెప్పక తప్పదనే ఉద్దేశంతో ఈ విషయం వెల్లడించానని టబు అంటోంది.

తాజా వార్తలు