తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి సుకన్య( Senior actress Sukanya) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈమె తెలుగులో పలు సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం తమిళ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.నటి సుకన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇకపోతే సుకన్యలో నాట్య, సంగీత కళాకారిణి, గాయని, గీత రచయిత కూడా ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు.తాజాగా నటి సుకన్య శ‍్రీరాముని కోసం ఒక భక్తి గీతాన్ని రూపొందించింది.
అయోధ్య శ్రీరామచంద్రుని ( Ayodhya Sri Ramachandra ) ఆలయ నిర్మాణం సాకారమవుతున్న తరుణంలో ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు.ఈ ఆలయం నిర్మాణం ప్రారంభించిన సమయంలో తన ముఖంపై గీసుకున్న శ్రీరామ్ అనే చిత్రలేఖనం అప్పట్లో సోషల్ మీడియాలో విశేష ప్రాచుర్యం పొందిందన్నారు.తాజాగా 500 ఏళ్ల నాటి కల జనవరి 22న సాకారం కాబోతోన్న వేళ తాను రూపొందించిన జై శ్రీరామ్ భక్తిరస గీతాన్ని( Jai Shriram devotional song ) వీడియోగా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
శ్రీరామ నామ మహిమ, ఆయన పరాక్రమం, రామాయణం కథను ఆవిష్కరించే విధంగా తాను రూపందిస్తున్న జై శ్రీరామ్ ఆడియోను ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో భాగంగా సమర్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.ఇకపోతే అయోధ్య రామ మందిర విషయానికి వస్తే.మరి కొద్ది సేపట్లో రామ్ లల్లా విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్న విషయం తెలిసిందే.
ఆ గడియల కోసం దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రజలు వేసి చూస్తున్నారు.ఇప్పటికే అక్కడికి ప్రముఖులు అందరూ చేరుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy