Rambha Sasha :యాక్సిడెంట్ తర్వాత లైవ్ కి వచ్చిన నటి రంభ.. అభిమానులకు ఏం చెప్పిందంటే?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపును ఏర్పరచుకుంది రంభ.

ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక అప్పట్లో రంభ తన అందంతో కొద్దిగా కాలం పాటు సినీ ఇండస్ట్రీలో ఒక విలువ వెలిగింది.

ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తుంది హీరోయిన్ రంభ.ఇది ఇలా ఉంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో హీరోయిన్ రంభ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.అందుకు గల కారణం రోడ్డు ప్రమాదానికి గురి కావడం.

తాజాగా హీరోయిన్ రంభ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం మనందరికీ తెలిసిందే.ఆమె తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వస్తున్న సమయంలో ఆమె కారుకి యాక్సిడెంట్ అయింది.

Advertisement

ఈ ప్రమాదంలో ఆమె కూతురు సాషాకు గాయాలు అయ్యాయి.ఈ సంఘటన జరిగిన వెంటనే సాషాని ఆసుపత్రికి చేర్పించి ఆమెకు చికిత్స అందించారు.

కాగా కారు ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో అయిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా కారు యాక్సిడెంట్ తర్వాత మొట్టమొదటిసారి ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చింది హీరోయిన్ రంభ.

తన కూతురి కోసం ప్రార్థించి తన కూతురు బాగుండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని తెలిపింది.ఆ వీడియోలో రంభ మాట్లాడుతూ.మొదటిసారి ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చాను.

నాకోసం నా కుటుంబం కోసం ప్రార్థించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.నేను మీ అందరికీ ఎంతగానో రుణపడి ఉంటాను.

మీరు 11 వ తారీఖున జన్మించారా....అయితే మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

ప్రస్తుతం నా కూతురు నా కుటుంబం నేను క్షేమంగానే ఉన్నాము.నా కూతురు కూడా క్షేమంగానే ఉంది.

Advertisement

తననీ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వచ్చాము.మా మీద ఇంత ప్రేమను చూపించినందుకు ఎంతో సంతోషంగా ఉంది.

మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అని తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకుంది రంభ.మొదటిసారి ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన రంభ ఇలా ఎమోషనల్ గా మాట్లాడింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజా వార్తలు