Actress pragathi Dance ; సోదరి పెళ్లిలో నటి ప్రగతి డాన్స్.. వీడియో వైరల్?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి,క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ప్రగతి తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ఇక సినిమాలలో హీరో హీరోయిన్లకు మదర్ క్యారెక్టర్లలో ఎక్కువగా నటించిన విషయం తెలిసిందే.కాగా ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.

మరొకవైపు తన ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంది.ప్రగతి సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా విపరీతంగా పాపులారిటీని సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది ప్రగతి.ఇకపోతే ఇప్పటికే ఈమె డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిన విషయం తెలిసిందే.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి తన మాస్ స్టెప్పులను ఇరగదీసింది ప్రగతి.చెల్లెలి పెళ్లిలో పూనకం మాస్ డాన్స్ ను ఇరగదీసింది.

అయితే ఈసారి మరింత ఎనర్జిటిక్ గా మాస్ డాన్స్ తో రెచ్చిపోయింది ప్రగతి.డప్పుల సౌండ్లకి పూనకం వచ్చిన లాగా డాన్స్ చేస్తూ అల్లరి అల్లరి చేస్తూ చిందులు వేసింది.

అంతేకాకుండా బరాత్ డోలు మీద కూర్చుని తీన్మార్ డాన్స్ చేసింది.గట్టి గట్టిగా అరుస్తూ పెళ్లిలో ఫుల్ గా ఎంజాయ్ చేసింది ప్రగతి.అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా చెల్లి పెళ్లి.

అందుకే సైలెంట్ గా ఉండలేకపోతున్నాను.పిచ్చిని ప్రవహించనివ్వండి అంటూ రాసుకు వచ్చింది ప్రగతి.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు ప్రగతి డాన్స్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఈ వయసులో కూడా ప్రగతి అంత ఎనర్జిటిక్ గా డాన్స్ చేయడంతో అభిమానులు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

కొందరు పాజిటివ్ గా మరికొందరు మాత్రం నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

తాజా వార్తలు