Pia Bajpiee : ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ని గుర్తు పట్టారా.. 20 సినిమాల్లో ఒక్క మూవీ హిట్?

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా రాణించాలి అన్న నిలదొక్కుకోవాలి అన్నా కూడా చాలా కష్టం.

ఎందుకంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో రాణించగలం అని ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీలు తెలిపారు.

హీరోల సంగతి పక్కన పెడితే, హీరోయిన్స్ విషయానికి వస్తే ఒకవైపు యాక్టింగ్ పరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ సూపర్ హిట్ సినిమాలలో నటించినప్పటికీ అంతంత మాత్రంగానే అవకాశాలు వస్తూ ఉంటాయి.అలా పదుల సంఖ్యలో సినిమాలలో నటించినప్పటికీ కెరియర్ లో చెప్పుకోదగ్గ సరైన హిట్ సినిమా ఒక్కటి కూడా లేక సినిమా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు హీరోయిన్స్.

అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు.ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు పియా బాజ్‌పాయ్( Pia Bajpiee ).ఉత్తరప్రదేశ్‌లోని ఎతావాలో పుట్టిన ఈమె దిల్లీలో సెటిల్ అయ్యింది.సినిమాల్లోకి వెళ్తానంటే తల్లిదండ్రులు తిట్టారు.

దీంతో ఒకవైపు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే నటి కావడం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది.అందులో భాగంగానే ముంబయికి మకాం మార్చింది.

Advertisement

మొదట సీరియల్స్‌కి డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది.ఆపై అమితాబ్, ధోనీ లాంటి వాళ్లతో యాడ్స్‌లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ.

అలా యాడ్స్ లో నటిస్తున్న సమయంలోనే ఆమె డైరెక్టర్ ప్రియదర్శన్( Priyadarshan ) కంటపడింది.ఆయన తీసిన ఒక యాడ్‌తో పియా ఫేమ్ తెచ్చుకుంది.2008లో పోయ్ సొల్ల పోరమ్ అనే తమిళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది.ఆ తర్వాత ఏడాదే నిన్ను కలిశాక అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే నటిగా మారిన మూడేళ్లకు రంగం మూవీ( Rangam )తో గుర్తింపు తెచ్చుకుంది.కానీ ఆ తర్వాత పలు సినిమాలు చేసినా హిట్ కొట్టలేకపోయింది.తెలుగు తమిళ మలయాళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు నటించినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.

ఇక ఇటీవలే ఓటీటీ లో విడుదల అయిన లాస్ట్ అనే హిందీ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన విషయం తెలిసిందే.సినిమా లలో నటించకపోయినప్పటికీ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్లతో కాక రేపుతూ ఉంటుంది.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు