పవిత్ర లోకేష్ రోజుకి అంత తీసుకుంటుందా..?

న‌టి ప‌విత్ర లోకష్ ( Pavithra lokesh )అంటే క‌న్న‌డ‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ప‌రిచ‌యం.

అయితే తెలుగులో మాత్రం సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కార‌ణంగా ట్రెండింగ్ గా మారింది.

ఆమెకు సినిమాల‌తో వ‌చ్చిన పాపులారిటి కంటే న‌రేష్( Naresh ) తో రిలేష‌న్ వ‌ల్ల వ‌చ్చిన పాపులారిటీ ఎక్కువ అని చెప్పాలి.సమ్మోహనం సినిమాలో భార్యాభర్తలుగా కలిసి నటించిన సమయంలో వీరి మధ్య స్నేహం మొదలైంది.

తర్వాత ఇద్దరూ కలిసి ప్రయాణం సాగిస్తున్నారు.అధికారికంగా ఇద్దరికీ పెళ్లి జరిగిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు కానీ.

వాళ్లయితే అందరికీ భార్యాభర్తల్లాగే కనిపిస్తున్నారు.

Advertisement

తన మొదటి భర్తకు దూరమైన పవిత్ర.తన నివాసాన్ని కూడా హైదరాబాద్‌ కే మార్చేసింది.నరేష్‌ తో కలిసి ఆమె నటించిన మళ్ళీ పెళ్ళి( Malli Pelli ) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వీరి నిజ జీవిత బంధం నేపథ్యంలోనే ఈ సినిమా సాగింది .నిన్న విడుదలయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది .పవిత్ర నటన కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది .ఇక పవిత్ర లోకేశ్‌ ఇప్పటికే చాలా సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేసింది.కానీ నరేశ్‌తో ప్రేమ వ్యవహారం తర్వాతే బాగా గుర్తింపు వచ్చింది.

గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది.

ఈ విషయాన్ని నరేశ్‌ బహిరంగంగా ప్రకటించాడు.వీరిద్దరి నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో మల్లి పెళ్లి చిత్రాన్ని ఎమ్మెస్‌ రాజు( M.S.Raju ) తెరకెక్కించారు .నరేశ్‌ ఈ చిత్రంలో నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించాడు.ఇక్కడ విశేషం ఏంటంటే.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

ఈ చిత్రంలో నటించనందుకుగాను పవిత్ర భారీ రెమ్యునరేషన్‌ పుచ్చుకుందని టాక్ .వాస్తవానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన పవిత్ర లోకశ్‌ రోజుకు 50 వేలు పారితోషికంగా తీసుకునేదని అంటున్నారు .అయితే నరేశ్‌ ప్రేమ వ్యవహారంతో పవిత్ర మరింత ఫేమస్‌ అయింది.దీంతో ఆమె తన రెమ్యునరేషన్‌ని కూడా పెంచేసిందని తెలుస్తుంది .ప్రస్తుతం రోజుకు లక్ష వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఆమెకు ఉన్న క్రేజ్‌ దృష్ట్యా అంత మొత్తం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు వెనకడుగు వేయడం లేదట.

Advertisement

ప్రస్తుతం పవిత్రకు వరుస ఆఫర్స్‌ వస్తున్నాయి.తనపై వస్తున్న ట్రోల్స్‌ని పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీ అవుతోంది.

ఇక మల్లి పెళ్లి కి నరేష్ కూడా రోజుకి లక్ష ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి .

తాజా వార్తలు