టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన మీనా తన సినిమాల ద్వారా తెలుగులో ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు.
చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున ఇలా అందరు హీరోలకు జోడీగా మీనా నటించడం గమనార్హం.
మీనా భర్త విద్యాసాగర్ కొన్నిరోజుల క్రితం ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే.భర్త మరణ వార్త మీనాను, ఆమె కుటుంబ సభ్యులను ఎంతగానో బాధపెట్టింది.
అయితే భర్త మరణం తర్వాత నటి మీనా షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది.తాజాగా మీనా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆర్గాన్ డొనేషన్ గురించి మీనా అవగాహన కల్పించడంతో పాటు ఆమె కూడా ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు రావడం గమనార్హం.ఆగష్టు 13వ తేదీ వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే అనే సంగతి తెలిసిందే.
వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంలో మీనా ఈ నిర్ణయం తీసుకున్నారు.నేను అవయవాలను దానం చేయాలని నిర్ణయం తీసుకున్నానని మీరు కూడా అవయవాలను దానం చేయాలని ఆమె అన్నారు.
మానవుల ప్రాణాలను కాపాడటంను మించిన సహాయం ఇంకొకటి ఉండదని మీనా కామెంట్లు చేశారు.అవయవ దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలను కాపాడవచ్చని మీనా చెప్పుకొచ్చారు.
ఆర్గాన్స్ ను డొనేట్ చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులను నేను కళ్లారా చూశానని మీనా వెల్లడించారు.ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడే ఛాన్స్ ఉంటుందని నా భర్తకు అలాంటి దాతలు దొరికి ఉంటే ఆయన జీవితం వేరే విధంగా ఉండేదని ఆమె చెప్పుకొచ్చారు.అవయవ దానం గురించి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.
మీనా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy