Keerthy Suresh : కీర్తి సురేష్ అందం వెనుక అంత రహస్యం ఉందా.. బయటపడ్డ అసలు నిజం?

కొందరు హీరోయిన్స్ చూడటానికి చాలా అందంగా ఉంటారు.మేకప్ వేసుకోకున్నా కూడా మేకప్ వేసుకున్నట్లుగా కనిపిస్తూ ఉంటారు.

శరీరం, ముఖం మొత్తం ఒకే రంగుతో ఎటువంటి మచ్చలు లేకుండా ఉంటాయి.వాళ్ళు అంత అందంగా ఉండడానికి కారణం కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్లే అని చెప్పాలి.

చాలామంది హీరోయిన్స్ కొన్ని రకాల క్రీమ్స్ లాంటివి వాడుతూ ఉంటారు.ఇక మరికొంతమంది నాచురల్ పద్ధతితో అందంగా ఉంటారు.అయితే హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అంత అందంగా ఉండటానికి ఒక రీజన్ ఉందని తెలుస్తుంది.

అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.కీర్తి సురేష్( Keerthy Suresh ) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

తొలిసారిగా పైలెట్స్ అనే మలయాళం సినిమా ద్వారా బాలనటిగా వెండితెరపై అడుగు పెట్టగా.తరువాత తమిళ సినిమాలలో నటించింది‌.

ఇక 2016లో నేను శైలజ సినిమా( Nenu Sailaja ) ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ఎంతగానో ఆకట్టుకుంది.ఈ సినిమాలో తన పాత్రతో మాత్రం అందరిని ఫిదా చేసింది.

ఇక ఆ తర్వాత నటించిన మహానటి సావిత్రి పాత్ర ఎంత ఆకట్టుకుందో చెప్పనవసరమే లేదు.ఎందుకంటే ఆ సినిమాలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో లీనమైపోయింది.

ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వచ్చిపడ్డాయి.పైగా మంచి అభిమానాన్ని కూడా సంపాదించుకుంది.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

ఇక సర్కారు వారి పాట( Sarakaru Vaari Pata )లో కూడా మంచి సక్సెస్ అందుకుంది కీర్తి.ఈ సినిమాల్లో ఏకంగా గ్లామర్ షో కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇక అప్పటినుంచి బాగా గ్లామర్ షో చేసుకుంటూ పోతుంది.

Advertisement

రీసెంట్ గా దసరా సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం భోళాశంకర్ సినిమాలో బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.ఒకప్పుడు కీర్తి సురేష్ లుక్ ఎంతో హోమ్లీగా ఉండేది.

అంతేకాకుండా ఎక్కువ ట్రెడిషనల్ లుక్( Traditional Look ) లోనే కనిపిస్తుండేది.కానీ ఈ మధ్య గ్లామర్ ను పరిచయం చేసింది కీర్తి.

పైగా కాస్త సన్నబడి మంచి ఫిజిక్ సంపాదించుకుంది.ఇక కీర్తి చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది.అయితే తను అలా ఉండటానికి ఒక బ్యూటీ సీక్రెట్( Keethy Suresh Beauty Secret ) ఉందని తెలిసింది.

రీసెంట్గా తను ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా అందులో తనకు బ్యూటీ సీక్రెట్ గురించి ప్రశ్న ఎదురైంది.దానితో తను అందరిలాగా ఇతర ప్రొడక్ట్స్ వాడనని తెలిపింది.కేవలం నేచురల్ పద్ధతితో తను అందంగా ఉంటుందట.

తను వారానికి రెండుసార్లు నారింజ తొక్కతో ఫేస్ మాస్క్ వేసుకుందట.పసుపు కూడా అప్లై చేస్తుందట.

ఇక ముఖానికి పెరుగు రాస్తే చాలా గ్లో వస్తుందని తెలిపింది.నాచురల్ పద్ధతితో తప్ప కెమికల్స్ ప్రాడెక్ట్స్ వాడదట.

అందుకే తనకు ముఖం ఎప్పుడూ తాజాగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు