Jayalalitha : నేను కె.విశ్వనాథ్ మేనల్లుడిని పెళ్లి చేసుకోవాల్సింది.. కానీ: నటి జయలలిత

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి జయలలిత( Actress Jayalalitha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

ఈమె తెలుగు నటి అయినప్పటికీ మొదట మలయాళ సినిమాలతోనే కెరియర్ ను మొదలుపెట్టింది.

ఇక అప్పట్లో అయితే తెలుగు మలయాళ సినిమాలలో వ్యాంపు క్యారెక్టర్ లు చేసి తన అందచందాలతో ఒక ఊపు ఊపేసింది.తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది.

కేవలం మలయాళం లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా చాలా వరకు ఆమె వ్యాంపు క్యారెక్టర్లలో నటించింది.దాంతో అప్పట్లో ఈమెకు బోరింగ్ పాప( Boring Papa ) అనే బిరుదు కూడా వచ్చింది.

ఈమె కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరియర్ లో ఎదురైన చేదు అనుభవాల గురించి పెళ్లి, కెరియర్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ.నేను నృత్య ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు ఎంతోమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నన్ను చూసి పెళ్లి చేసుకుంటే మా నాన్నను అడిగేవారు.

అప్పుడు మా నాన్న వారందరితో నా కూతురికి అప్పుడే పెళ్లి చేయను డాన్సర్ చేస్తాను అని చెప్పి వాళ్ళ ఆఫర్లను రిజెక్ట్ చేసేవారు.అయితే హీరోయిన్ లేకపోతే డాన్సర్ అంతేగాని ఇప్పట్లో పెళ్లి చేయను అని చెప్పేవారు అని చెప్పుకొచ్చింది జయలలిత.

అయితే నాకు కళాతపస్వి కె.విశ్వనాథ్ మేనల్లుడితో( K Vishwanath ) పెళ్లి సంబంధం కుదిరింది.నేను టెన్త్‌లో ఉండగా విశ్వనాథ్ గారి మేనల్లుడితో సంబంధం కుదిరింది.

టెన్త్ రెండు సార్లు తప్పాను.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

వాళ్లింట్లో మేం అద్దెకు ఉండేవాళ్లం.ఆ సమయంలో విశ్వనాథ్ గారి మేనల్లుడు అమలాపురంలో మెడికల్ రిప్రజెంటేటివ్.వాళ్లకు నేను నచ్చి మీ అమ్మాయిని మేం చేసుకుంటాం అన్నారు.

Advertisement

నాన్న ఒప్పుకున్నట్టే ఒప్పుకుని కరెక్ట్‌గా నిశ్చయ తాంబూళాలు పుచ్చుకునే రోజు ఎస్కేప్ అయ్యారు.వీళ్లు వేచి చూశారు.

ముహూర్తం సమయం అయిపోయింది.ఆడపెళ్లి వాళ్లకే ఇంత ఉంటే మాకెంత ఉండాలి.

మేం చేసుకోం ఈ సంబంధం అని వెళ్లిపోయారు.అప్పటి నుంచీ విశ్వనాథ్ గారికి నా మీద కొంచెం ఉంది.

బ్రాహ్మణ అమ్మాయివి, డిగ్రీ చదివావు, డాన్సర్‌వి నీకు అవసరమా సినిమాలు అని తిడుతూ ఉండేవారు.శ్రుతిలయలు సినిమాలో అవకాశం ఇచ్చారు కానీ ఆయన నన్ను అంత ఎంకరేజ్ చేయలేదు అని జయలలిత చెప్పుకొచ్చారు.

తాజా వార్తలు