Fatima Babu: నటిని అలాంటి విషయాలు అడిగిన నెటిజెన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నటి?

తెలుగు ప్రేక్షకులకు నటి ఫాతిమా బాబు( Fatima Babu ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈమె సీరియల్స్ తో పాటు సినిమాలలో కూడా నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంది.

కాగా ఈమె తెలుగులో నవదీప్‌( Navdeep ) హీరోగా వచ్చిన గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ సినిమాలో అతడికి తల్లిగా నటించింది.ఆ తర్వాత కథానాయకుడు సినిమాలో నటించింది.

ఆ తర్వాత తెలుగు సినిమాలలో కనిపించలేదు.తరువాత తమిళంలో డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె కేవలం సీరియల్స్ లో మాత్రమే నటిస్తోంది.కాగా ఈమె తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

Advertisement

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె తన ఫేస్‌బుక్‌ ఖాతాలో కొన్ని స్క్రీన్‌ షాట్ ఫోటోలను షేర్‌ చేసింది.ఆ ఫోటోలని శారీ చేస్తూ ఒక నెటిజన్ తప్పుడు ప్రశ్నలు వేసి తనను ఇబ్బంది పెట్టాడని ఆమె తెలిపింది.

అసలేం జరిగింది అంటే.ఫాతిమా బాబు కొన్నేళ్ల క్రితం ఒక హిందువును పెళ్లి చేసుకున్నారు.

వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు.ఈ ఇద్దరికీ ఆమె ముస్లిం పేర్లను పెట్టారు.ఇదే విషయాన్ని ఒక నెటిజన్‌ ఆమెను అడిగాడు.

దీంతో ఆమెకు కోపం వచ్చింది.ఆమె స్పందిస్తూ.

How Wild Robin Works For UK Mobile Players : Skill, Luck, And Geolocation Explained
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

మీరు మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు.ఎలాంటి కండోమ్‌ వాడతామో కూడా అడుగుతారా? మీరు చర్చించుకోవటానికి మా పర్సనల్‌ విషయాలే దొరికాయా? ప్రతీ దానికి ఓ హద్దు ఉంటుంది.అవతలి వాళ్లకు ఇబ్బంది కలిగించకుండా మాట్లాడాలి అంటూ నెటిజెన్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది ఫాతిమా బాబు.

Advertisement

కాగా ఆ స్క్రీన్ షాట్ ఫోటోలు పై స్పందించిన కొంతమంది నెటిజన్లు ఫాతిమా బాబుకు మద్దతుగా నిలుస్తున్నారు.ఆమె చేసిన పనిని మెచ్చుకుంటున్నారు.

తాజా వార్తలు